ASBL Koncept Ambience

తానా ఎన్నిక కథ సుఖాంతం... కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డ్‌ ఆమోదముద్ర

తానా ఎన్నిక కథ సుఖాంతం... కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డ్‌ ఆమోదముద్ర

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ఇటీవల జరిగిన ఎన్నికలు, తరువాత పరిణామాలు, బోర్డ్‌ లో ఫిర్యాదులు వీటన్నింటిపై ‘తెలుగు టైమ్స్‌’ ఎప్పటికప్పుడు పాఠకులకు వార్తలను అందించిన సంగతి తెలిసిందే. బోర్డ్‌ చైర్మన్‌ తోపాటు, సభ్యుల అభిప్రాయలను కూడా తెలుగు టైమ్స్‌ అందించి అందరి ప్రశంసలను అందుకుంది. తాజాగా జరిగిన బోర్డ్‌ సమావేశంలో ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను తోసిపుచ్చుతూ, కొత్తగా ఎన్నికైన బోర్డ్‌ సభ్యులను, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల నియామకాలకు బోర్డ్‌ ఆమోదముద్ర వేసింది.

మార్చి 1వ తేదీ నుంచి కొత్త బోర్డ్‌, పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత తానా బోర్డ్‌ చైర్మన్‌ హనుమయ్య బండ్ల సభ్యులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. 29వ తేదీన బోర్డ్‌ సమావేశం జరిగిందని, అందులో ఎన్నికల ఓటింగ్‌ పై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి వాటిని తోసిపుచ్చడంతోపాటు, ఎన్నికల కమిటీ పంపిన రిజల్ట్‌ ను పరిగణలోకి తీసుకుంటూ, కొత్తగా ఎన్నికైన సభ్యుల ఎన్నికు అధికారికంగా బోర్డ్‌ ఆమోదముద్ర వేసినట్లు హనుమయ్య బండ్ల తాను పంపిన లేఖలో తెలియజేశారు. బోర్డ్‌ ఆమోదముద్ర వేయడంతో ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా నరేన్‌ కొడాలితోపాటు ఆయన టీమ్‌ బాధ్యతలను చేపట్టినట్లయింది.

 

 

Tags :