ASBL Koncept Ambience

తానా క్రికెట్ కప్... తెలంగాణపై తమిళనాడు ఘన విజయం

తానా  క్రికెట్ కప్... తెలంగాణపై తమిళనాడు ఘన విజయం

తానా ఆధ్వర్యంలో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం క్రికెట్‌ మైదానంలో ఈ నెల 9వ తేదీ నుంచి జరుగుతున్న దివ్యాంగుల దక్షిణ భారత క్రికెట్‌ కప్‌ 2022 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. తెలంగాణ, తమిళనాడు జట్లు మధ్య జరిగిన పోటీలో తమిళనాడు జట్టు తెలంగాణ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు జట్టు నిర్ణీత 15 ఓవర్లలో కేవలం 2 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. తమిళనాడు జట్టులో రాజాదురై 49 పరుగులు చేసి అర్థ సెంచురీకి చేరువగా వచ్చి రనౌట్‌గా వెనుతిరగగా, జయన్‌ ఆల్డ్‌ విజృంభించి 14 ఫోర్లుతో జట్టులో అత్యధిక స్కోర్ 85 పరులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన తెలంగాణ జట్టును తమిళనాడు బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన కేవలం 74 పరుగులు మాత్రమే చేశారు. కర్ణాటక జట్టు 10 వికెట్ల తేడాతో తెలంగాణా జట్టుపై ఘన విజయం నమోదు చేసింది. నిర్ణీత 12 ఓవర్లలో 8 వికెట్ల నస్టానికి తెలంగాణా జట్టు కేవలం 42 పరుగులు మాత్రమే చేయడంతో కర్ణాటక జట్టు కేవలం 3.5 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 44 పరుగులు సాధించి విజయం కైవశం చేసుకుంది.

 

Tags :