అసు యంత్రాల కొనుగోలుకు తిరుమలరావు విరాళం
తెలంగాణలోని చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చేస్తున్న సహాయానికి తనవంతుగా తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ తిరుమలరావు విరాళం ఇచ్చారు. దాదాపు 10 అసు యంత్రాల కొనుగోలుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఆయన తానాకు అందించారు. తానా అధ్యక్షుడు జే తాళ్ళూరికి ఆయన ఈ చెక్‌ను అందజేశారు. చేనేత కార్మికులకు అవసరమైన 1000 అసు యంత్రాల పంపిణీకి తానా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యంత్రాలకు అవసరమయ్యే వ్యయంలో 50శాతం ఖర్చును తానా భరిస్తోంది. మిగతా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, లబ్దిదారులు భరిస్తున్నారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో తానా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Tags :