గూగుల్ ఉపాధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తొలి రోజు అమెరికా పర్యటన విజయవంతమైంది. పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపి, నవ్యాంధ్రకు పెట్టుబడులతో రావాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గూగుల్ ఉపాధ్యక్షుడు టామ్ మూర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. గూగుల్ ప్రస్తుత ఆవిష్కరణల గురించి టామ్ వివరించారు. వాటిల్లో దేన్నైనా ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని, రాష్ట్రానికి వచ్చి స్థలాన్వేషణ సాగిస్తే, సెంటర్‌ను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల అనుమతులనూ సత్వరమే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం ప్లెక్స్ ట్రానిక్స్ సీఈవో మైక్ మెక్ సమరతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వనరుల గురించి వివరించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీనిపై స్పందించిన మైక్ మెక్ విశాఖలో ఇప్పటికే తమ ఉనికి ఉందని గుర్తు చేశారు. భారత్‌లో సంస్థ విస్తరణకు గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు.