ASBL Koncept Ambience

వ్యవసాయంలో ఎపి విధానంపై ప్రశంసలు

వ్యవసాయంలో ఎపి విధానంపై ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌ జీరో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తుందని ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఐ సి ఆర్‌ ఏ ఎఫ్‌ కి చెందిన ప్రపంచ అగ్రోఫారెస్ట్రీ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టోనీ సైమెన్స్‌ ప్రశంసించారు. ఆయనతోపాటు ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రవి ప్రభు న్యూయార్క్‌ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తమ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్న సేంద్రీయ సేద్యాన్ని ఆసక్తికరంగా పరిగణిస్తుందని డాక్టర్‌ టోనీ సైమెన్స్‌ అన్నారు. అభివృద్ధిలోనే పరిశోధన ఉంటుందని.. ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో అది స్పష్టంగా కనిపిస్తోందని వారు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ లో కూడా తమ సంస్థ ద్వారా పరిశోధనలు చేయడానికి ఆసక్తిని వారు వ్యక్తం చేసారు. క్షేత్ర స్థాయిలో సవివరమైన, లోతైన వాస్తవ లెక్కలను, వివరాలను ఏపీ లో సంగ్రహించాలని వారు అన్నారు. దీని ఆధారంగా మరింత లోతైన పరిశోధనలు నిర్వహించి ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయవచ్చని వారు తెలిపారు. రైతులకు ఇచ్చే శిక్షణ కూడా దీనిలో కీలకమని, ఆ దిశగా ముఖ్యమంత్రి ఆలోచన విధానం సాగడం ఆహ్వానించదగ్గదని ఆ సంస్థ ప్రతినిధులు అన్నారు. పరిశోధన, పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుని ప్రకతి సేద్యాన్ని పెద్ద ఎత్తున చేపట్టే ఆంధ్రప్రదేశ్‌ ప్రయత్నంలో తాము భాగస్వామ్యం అవ్వడానికి సిద్దమే అని అగ్రోఫారెస్ట్రీ డీజీ ఆసక్తి వ్యక్తం చేసారు.

 

Tags :