ASBL Koncept Ambience

తానా వేదికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఘనసత్కారం

తానా వేదికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఘనసత్కారం

అగ్రరాజ్యం అమెరికాలో ఘనంగా జరిగిన తానా 23వ మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. వేద పండితుల ఆశీర్వాదాల అనంతరం ఆయన్ను తానా నేతలు సన్మానించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు తానాతో 20 సంవత్సరాల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. మహానేత ఎన్టీఆర్ వేసిన పునాదులే ప్రస్తుతం దేశంలో సంకీర్ణ రాజకీయాలను ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి ఎన్నారైలు కృషి చేయాలని సూచించారు. అమెరికాతో తెలుగు రాష్ట్రాలు పోటీ పడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎన్నారైలు తెలంగాణకు రావాలని, వాళ్లకు ఇక్కడ సముచిత గౌరవం దక్కేలా చూసే బాధ్యత తను తీసుకుంటానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు ఎంతో కీలక పాత్ర పోషించాలని ఆశించారు.

 

 

 

Tags :