అలరించిన ట్రైస్టేట్ దీపావళి వేడుకలు
చికాగోలో ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో నవంబర్ 11న దసరా, దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్థ అధ్యక్షుడు హేమచంద్ర వీరపల్లి ఆధ్వర్యంలో స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ లేక్ కౌంటీ ఆలయ ప్రాంగణంలో ఈ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రసాద్ మరువాడ, హేమంత్ పప్పు, ప్రశాంతి తాడేపల్లి, గుప్తా నాగుబండి సమక్షంలో సోమలత ఎనమందల, అర్చన మిట్ట ఈ కార్యక్రమాలను ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు. సోమలత ఎనమందల, హేమంత్ పప్పు తదితరులు వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. విద్య మరువాడ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి జగదీశ్ కానూరు, శ్రీనాథ్ వాసిరెడ్డి, వీరాస్వామి అచంట, రామకృష్ణ కొర్రపోలు, దిలీప్ రాయలపూడి, భాను సిరమ్, గుప్త నాగుబండి, రవి వేమూరి, అపర్ణ అయ్యలరాజు తోడ్పాటునందించారు.
చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సంగీతం, నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి తానా సభ్యులు హేమ కానూరు, హనుమంతు చెరుకూరి, రవి కాకర, సందీప్ చిరుగళ్ళ విచ్చేసి పోటీల్లో పాల్గొన్నవారికి ధ్రువపత్రాలు బహుకరించి ప్రోత్సహించారు. శ్రీనివాస్ పెద్దముల్లు, సాయినాథ్ బోయపల్లి, రమేష్ నాయకంటి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వాలంటీర్లు రామకృష్ణ తాడేపల్లి, లీల ప్రసాద్ వీరపల్లి, మిథున్ యనమదల, నవీన్ యనమందల తమ సహకారాన్నందించారు.