ఘనంగా ట్రై స్టేట్ తెలుగు దసరా, దీపావళి 2016
నవంబర్ 13న ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో దసరా/ దీపావళి పండుగను లెమొంటో హిందూ టెంపుల్ ఆడిటోరియం లో జరుపుకున్నారు. టి.టి.ఎ బోర్డు సభ్యులు వందేమాతరం ఆలపించి ఈ వేడుకలను ప్రారంభించారు.
నాగ శ్రీహర్ష ముద్దా ఆలపించిన వినాయక పంచరత్నం ప్రార్థనతో 2:00 గంటలకు కార్యక్రమాలు మొదలయ్యాయి. సంగీతం, సెమి క్లాసికల్ మరియు టాలీవుడ్ /బాలీవుడ్ నృత్యాలు, వాయిద్య మరియు గాత్ర ప్రదర్శనలతో నిండిపోయింది.
ఆశ్వినీ, శ్రేయ గుండెల్లి, సంధ్య రాధాకృష్ణన్ టీమ్స్ భరతనాట్యం ప్రదర్శించారు. సుస్మితా అరుణ్ కుమార్ టీం, క్షమా షా టీమ్, సామ్య కుమరన్ టీమ్ మరియు జ్యోతి వంగర టీం ప్రదర్శించిన సెమీ క్లాసికల్ మరియు ప్యూజన్ ఈవెంట్స్ ఎంతో చక్కగా ఎంజాయ్ చేశారు. భాగ్య నగేష్ టీ, అపురూప తిప్పరాజు టీం డేజ్లింగ్ దివాస్, శశికళ, పల్లా టీం ప్రదర్శించిన టాలీవుడ్ /బాలీవుడ్ నృత్యాలు ప్రేక్షకుల ని అలరించాయి. దీప్తి యొక్క బాలీ నాట్యం ద్వారా సమర్పించబడిన ఒక ప్రత్యేక నృత్య అంశం తండ్రి హేమంత్ పప్పు, ఆరి తనయుడు టీం చేసిన క్రేజీ లవ్ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సమన్విత కలిగొట్ల సోలో గాత్ర ప్రదర్శన, రాకింగ్ సింగెర్‌స టీం పాడిన పాటలు విన సొంపుగా ఉన్నాయి. అనుపమ చంద్రశేఖర్ టీం వారు చేసిన వాయిద్య మ్యూజిక్ ఐటమ్స్ లో చిన్నారుల ప్రతిభ వీక్షకులని ఆశ్చర్య చకితులని చేసింది. అనికా అయ్యలరాజు, ప్రియాంక మరియు సీతా శాన్వి మైలవరపు వీణా వాదనం ఒక ప్రత్యేక ఆకర్షణ. రాధికా గరిమెళ్ళ ఆధ్వర్యంలో సిలికాన్ ఆంధ్ర మనబడి పిల్లలు చేసిన తెనాలి -రామ- దొంగలు హాస్య నాటిక అందరినీ కడుపుబ్బా నవ్వించింది. చిన్న పిల్లలు తెలుగులో మాట్లాడుతూ చక్కనిన హావభావ ప్రదర్శనతో చేసిన ఈ నాటకానికి కళాత్మకంగా వేసిన స్టేజీ సెట్టింగ్స్ తోడయ్యి మరింత వన్నె తెచ్చిందని ప్రేక్షకులు అన్నారు.
కొండపల్లి బొమ్మలకి జీవం వస్తే ఎలా ఉంటుంది. అన్న థీమ్ తో దేవకీ జానకి రామన్ టీం చేసిన నాట్య ప్రదర్శన ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరిగా గ్రాండ్ ఫినాలే. అపర్ణ ప్రశాంత్ గారి నృత్య తరంగ కూచిపూడి అకాడమీ వారి టీం ప్రదర్శించిన ట్రిబ్యూట్ టు గంగా నృత్యం రూపకం. వ్యాఖ్యాతలుగా శ్రీలక్ష్మిదువ్వపు, ప్రణతి కలిగొట్ల సందర్భోచితంగా చతురోక్తులతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పిదప నోరూరించే వంటకాలతో ప్రియా రెస్టారెంట్ వారి డిన్నర్ తో దసరా దీపావళి ఉత్సవాలు పూర్తి అయ్యాయి.