ASBL Koncept Ambience

సంతోష్ స్థానంలో హరీశ్

సంతోష్ స్థానంలో హరీశ్

టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు పేరును చేర్చాలని ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ కోరింది. కేసీఆర్‌, కేటీఆర్‌, సహా 20 మందిని తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లుగా పేర్కొంటూ ఈ నెల 23న ఎన్నికల కమిషన్‌కు టీఆర్‌ఎస్‌ ఓ జాబితా అందజేసింది. అయితే, అందులో హరీశ్‌ పేరు లేకపోవడంతో రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన పేరును తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చాలని ఈసీని టీఆర్‌ఎస్‌ కోరింది. తమ ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ స్థానంలో హరీశ్‌ను స్టార్‌ క్యాంపెయినర్‌గా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది.

 

Tags :