ASBL Koncept Ambience

బీజేపీలోకి జితేందర్ రెడ్డి ?

బీజేపీలోకి జితేందర్ రెడ్డి ?

టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేతగా వ్యవహరించిన జితేందర్‌ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ నెల 29న మహబూబ్‌నగర్‌ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా జితేందర్‌ రెడ్డి గెలుపొందారు. ఇదే స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న జితేందర్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ జితేందర్‌ రెడ్డితో చర్చించిన అనంతరం చేరిక దాదాపు ఖరారైనట్లు సమాచారం.

 

Tags :