ASBL Koncept Ambience

కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఏర్పాట్లు

కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఏర్పాట్లు

టీఆర్‌ఎస్‌ ఇరవై ఏండ్ల పండుగను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ద్వి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25న మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ వేదికగా జరిగే ప్లీనరీ, నవంబర్‌ 15న వరంగల్‌లో నిర్వహించే తెలంగాణ విజయగర్జన సభ విజయవంతానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రెండు సభలకు జిల్లా కమిటీల నుంచి మొదలు ప్రతీ వార్డు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా పార్టీ అధినాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా వివిధ జిల్లాల నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు   ఎంపీ కేశవరావు, మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐసీసీలో జరిగే ప్లీనరీకి వచ్చే నేతలంగా గులాబీ రంగు వస్ర్తాలు ధరించి రావాలన్నారు. ప్లీనరీ రోజు ప్రతి డివిజన్‌ను గులాబీమయం చేయాలని కోరారు.

గ్రేటర్‌లో ఎటుచూసినా గులాబీ జెండా రెపరెపలతో పండుగ వాతావరణం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే అతిథులు, ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున స్వాగత తోరణాలతో ఆహ్వానం పలకాలన్నారు. క్రమ పద్ధతిలో పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతున్నదని.. రాబోయే తొమ్మిది నెలల పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ శ్రేణులు విజయవంతం చేయాలని సూచించారు.

 

Tags :