విజయవంతంగా ముగిసిన డొనాల్డ్ ట్రంప్ పర్యటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటన ముగిసింది. తన గౌరవార్థం రాష్ట్రపతి భవన్‍లో విందు అనంతరం ట్రంప్ నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి సతీమణి మెలానియాతో కలిసి అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యారు. 36 గంటల సందర్శన అనంతరం ట్రంప్ సతీ సమేతంగా అమెరికాకు పయనమైనారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత్ సందర్శించినందుకు ట్రంప్‍కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే విషయంలో తాము ఎంతో పురోగతి సాధించామని మోడీ ట్విట్టర్‍లో పేర్కొన్నారు. ట్రంప్ పర్యటనను చరిత్రాత్మకమైనదిగా ఆయన అభివర్ణించారు. తమ పర్యటన సందర్భంగా ట్రంప్, ఆయన సతీమణి మెలానియా భారతీయ సంస్క•తి, ఆతిధ్యంలో వివిధ కోణాలను ఆస్వాదించారని ఆయన అన్నారు. భారత దేశ ప్రజలు వారిని ఎంతో సాదరంగా ఆహ్వానించారన్నారు. త్వరలోనే వారు మరోసారి భారత్ రావాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.