ASBL Koncept Ambience

హైదరాబాద్‍ హౌజ్‍లో ట్రంప్‍, మోదీ భేటీ

హైదరాబాద్‍ హౌజ్‍లో ట్రంప్‍, మోదీ భేటీ

ఢిల్లీలోని హైదరాబాద్‍ హౌజ్‍లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍, ప్రధాని నరేంద్ర మోదీలు భేటీ అయ్యారు. ఇద్దరు పలు అంశాలపై చర్చించుకున్నారు. గడిచిన కొన్ని రోజులు అద్భుతంగా సాగాయని ట్రంప్‍ అన్నారు. వాణిజ్యం, రక్షణ ఒప్పందాల్లో జరిగిన ప్రగతి గురించి మీడియాకు వివరించనున్నట్లు తెలిపారు. మొతేరా స్టేడియంలో జరిగిన ఈ వెంట్‍ను గొప్ప గౌరవంగా భావిస్తానని ట్రంప్‍ అన్నారు. మోదీ పేరు ప్రస్తావించిన ప్రతిసారి జనం ఊగిపోయారన్నారు. ప్రధాని మోదీ మాట్లాడారు. ఓ ప్రపంచాధినేత కోసం గతంలో ఎన్నడూ భారత్‍లో ఇంత పెద్ద ఈవెంట్‍ జరగలేదని అన్నారు. మీ కుటుంబంతో ఇండియాకు రావడం సంతోషంగా ఉందన్నారు. బిజీ షెడ్యూల్‍ ఉన్న ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు.

 

Tags :