ASBL Koncept Ambience

ఆ ముగ్గురు ఉన్న గదిలోనే డొనాల్డ్ ట్రంప్‍కు వసతి

ఆ ముగ్గురు ఉన్న గదిలోనే డొనాల్డ్ ట్రంప్‍కు వసతి

ఐటీసీ మౌర్య హోటల్‍లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ 446 చదరపు అడుగల విశాలమైన గ్రాండ్‍ ప్రెసిడెంట్‍ సూట్‍ అయిన చాణక్యలో ఉంటారు. గతంలో భారత పర్యటన వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి బుష్‍, బిల్‍ క్లింటన్‍, ఒరాక్‍ ఒబామా కూడా ఇదే సూట్‍లో బస చేశారు. ఇందులో నెమలి థీమ్‍లోని 12 సీట్ల ప్రైవేట్‍ డైనింగ్‍ రూమ్‍, ముత్యాలతో పొదిగిన సామగ్రితో కూడిన బాత్‍రూమ్‍, మినీ స్పా, జిమ్‍ ఉన్నాయి. ఈ సూట్‍కు బుల్లెట్‍ ప్రూఫ్‍ గ్లాస్‍లు ఏర్పాటు చేశారు. అలాగే, సూట్‍ నుంచి నేరుగా హోటల్‍కు, పార్కింగ్‍ ఏరియాకు వెళ్లేందుకు ప్రత్యేక దారి ఉంటుంది. హై స్పీడ్‍ ఎలివేటర్‍ కూడా ఉంది. అలాగే, ప్రెసిడెన్షియల్‍ సూట్‍లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‍ ప్రమాణాల ప్రకారం స్వచ్ఛమైన గాలి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సూట్‍కు ఎదురుగా ఉండే మరో సూట్‍ను ఇవాంకాకు కేటాయించారు.

 

Tags :