ASBL Koncept Ambience

ఒక్కొక్క మెట్టు ఎక్కి విజయపథానికి చేరువవుతున్న తెలుగు టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ ఫంక్షన్

ఒక్కొక్క మెట్టు ఎక్కి విజయపథానికి చేరువవుతున్న తెలుగు టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ ఫంక్షన్

తెలుగు టైమ్స్‌ 20 ఏళ్ళ వచ్చిన సందర్భంగా తెలుగు టైమ్స్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌  అవార్డ్స్‌ ఫంక్షన్‌ చేస్తున్నామని ప్రకటించగానే చాలా మంది అభినందనలు తెలిపారు. ఆ పనిలో దాదాపు నెల - రెండు నెలల రోజులు  ఏ విధంగా చేయాలి.. అని చాలా మంది పెద్దవాళ్ళతో చర్చించడం జరిగింది. అందరి అభిప్రాయాలు తీసుకొన్న తరువాత టీవీ9 యాజమాన్యాన్ని సంప్రదించి వారి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్న తరువాత ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది మాకు మొదటిమెట్టు...

*  అయితే ఈ విషయాన్ని తెలుగు కమ్యూనిటీకి చేర్చడం ఎలాగా అన్న ఆలోచన నుంచి వచ్చిన ఐడియా తానా, ఆటా నాటా, నాట్స్‌, టీడీఎఫ్‌, టీటీఏ వంటి జాతీయ తెలుగు సంఘాలను సంప్రదించడం  వారు కమ్యూనిటీ పార్టనర్స్‌గా వ్యవహరిస్తూ, ఈ అవార్డు కార్యక్రమాల వార్తలను వాళ్ళ సభ్యులకు చేర్చడానికి  ఒప్పుకొన్నారు. (రెండవ మెట్టు)

*  అనేక మంది పెద్దవారిని సంప్రదించి వారిని ఈ అవార్డుల ఎంపికలో వారి సహాయం కోరడం, ప్యానల్‌ అడ్వయిజర్‌గా ఉండేందుకు ఒప్పించడం జరిగింది. (మూడవ మెట్టు)

*  తెలుగు టైమ్స్‌కి ఆప్తులు అయిన 52 ఏళ్ల బే ఏరియా తెలుగు సంఘం ఆర్గనైజింగ్‌ పార్టనర్‌ గా వుండాలని కోరగానే వారు ఒకే అనటంతో ఇంకొక మెట్టు ఎక్కాము. (4వ మెట్టు)

*  మొదటగా ఈ అవార్డులకోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌ సైట్‌ తయారు చేసి, ఆ వెబ్‌సైట్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న  ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ డా. టీ.వి. నాగేంద్ర ప్రసాద్‌గారితో విడుదల చేయించడం చూసి అందరూ అభినందించారు. ఒక్కసారిగా అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ ఈ అవార్డు వేడుకల వార్తను అందించాం. (5వ మెట్టు)

*  ఏప్రిల్‌ 28న ప్రకటన వెలువడగానే హైదరాబాద్‌లో ఉన్న డిజిటల్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీ, తెలుగు ట్కెమ్స్‌ సిబ్బంది, శాన్‌హోసెలో ఉన్న తెలుగు టైమ్స్‌ సిబ్బంది తెలుగు బిజినెస్‌ అవార్డు 2023కి సంబంధించిన ప్రచారాన్ని చేపట్టారు. ఇ`మెయిల్స్‌ పంపడం, కరపత్రాలు ఇవ్వడం, ఫ్లయర్స్‌, పిపిటీలు చేసి అందరికి పంపడంతోపాటు వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చేశాము. డల్లాస్‌, న్యూజెర్సి, డిట్రాయిట్‌ లాంటి పట్టణాలకు వెళ్లి తెలుగు పెద్దలను కలిసి వారి ద్వారా తెలుగు ఎంట్రప్రెన్యూరర్స్‌తో సమావేశాలు నిర్వహిం చడం చేశాం. మే 26, 28 తేదీలలో న్యూజెర్సీ లో జరిగిన నాట్స్‌ సంబరాలలో తెలుగు టైమ్స్‌ బిజినెస్‌ అవార్డ్స్‌ గురించి ఒక కార్యక్రమం చేశాము. టీవీ 9 వారు ఆ కార్యక్రమం కూడా ప్రసారం చేయడం, నాట్స్‌ సంబరాలలో తెలుగు టైమ్స్‌ కాపీలు, బిజినెస్‌ అవార్డుకి చెందిన పాంప్లెట్స్‌ ఇవ్వడం వలన అందరికి తెలిసింది  (6వ మెట్టు)

*  తెలుగు టైమ్స్‌ బిజినెస్‌ అవార్డుకి నామినేషన్లు  వస్తున్నాయి. అయితే ఇదే మొదటిసారి అవడం వలన ఈ కార్యక్రమం ఎలాగా ఉంటుందో  తెలీక చాలా మందికి అవార్డు గురించి తెలిసినా, నామినేషన్స్‌ వేయలేదు అనిపించింది. అందుకని ఒక వైపు నామినేషన్లు స్వీకరించే గడువు పెంచడం, మరింత పబ్లిసిటీ చేయడం వలన  వచ్చిన, వస్తున్న నామినేషన్లుతో పాటు, అడ్వయిజరీ ప్యానల్‌ వారితో ఎప్పటికప్పుడు చర్చిస్తూ, ఇంకా అనేక బిజినెస్‌ సంస్థలకు అవార్డుకు సంబంధించిన విషయాలను పంపిస్తూ వారి వారి నామినేషన్స్‌ను ఆహ్వానిం చడం జరిగింది. (7వ మెట్టు)

*  ఈ అవార్డు ఫంక్షన్‌ మాములుగా జరిగే కల్చరల్‌ ఫంక్షన్‌లాగా కాకుండా ఒక బిజినెస్‌ ఈవెంట్‌లాగానే చేయాలని మొదటి నుంచి అనుకొంటున్నాం. అంటే ఒక్కొక్క గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌ను స్టేజి మీదకు పిలిచి, 2 లేక 3 నిమిషాలు మాట్లాడిన తరువాత, అవార్డుకి విజేతని ప్రకటించి, అవార్డును ప్రజంట్‌ చేస్తామన్నమాట. అంటే 10-15 అవార్డుల కోసం అవార్డులు ఇచ్చే పెద్ద వాళ్ళు (Gబవర్‌ం శీట నశీఅశీతీ)కుడా అవసరం కాబట్టి, ఆ అవార్డును బహూకరించే పెద్దవాళ్ళను గుర్తించి వారిని కలిసి, మాట్లాడి ఒప్పించే పని చేస్తున్నాం. తప్పకుండా అందరికి గుర్తుండి పోయే విధంగా ఈ అవార్డు వేడుక ఉండాల న్నదే మా ప్రయత్నం. (8వ మెట్టు)

*  ఈ విధంగా విజయానికి చేరువలో ఉన్న తెలుగు టైమ్స్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్సు మరిన్ని విజయ సోపానాలు దాటి విజయవంతంగా పూర్తి అవుతుందని మా నమ్మకం.

- చెన్నూరి వెంకట సుబ్బారావు

 

శ్రీకాంత్‌ అన్నపల్లి  - టీవీ 9 యూఎస్‌ఏ

తెలుగు టైమ్స్‌ వారు బిజినెస్‌ అవార్డ్సు చేయాలి అన్న ప్రతిపాదన వచ్చినప్పుడు మాకు కూడా ఈ ఐడియా చాలా బాగుంది అని అనిపించింది. హైదరాబాద్‌లో మేనేజింగ్‌ ఎడిటర్‌ రజనికాంత్‌, బిజినెస్‌ ఎడిటర్‌ సుకుమార్‌లు కూడా చాలా మంచి ఐడీయా ఇది. ఆమెరికాలోని తెలుగు బిజినెస్‌కి మనం అందించే కొత్త వేదిక అవుతుంది అని చెప్పారు. ఆ విధంగా టీవీ9 ఈ కార్యక్రమానికి ఎక్స్‌క్లూజివ్‌ మీడియా పార్టనర్‌గా ముందుకు వచ్చింది. ఇప్పటికే మాములుగా ఇచ్చే స్క్రోల్స్‌ మెసేజ్‌లు మాత్రమే కాకుండా టీవీ9, డిజిటల్‌ మీడియా లోను, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంలలో కూడా ఈ అవార్డు వేడుకల విషయాన్ని పబ్లిసిటీ చేసి అందరికీ ఈ వివరాలు అందాలి అనుకుంటున్నాం. అలాగే అవార్డ్సు వేడుకలను కూడా చాలా బాగా రిచ్‌గా, గ్రాండ్‌గా ఉండేలా చేస్తున్నాం. 5 కెమెరామెన్‌లతో అవార్డు ఫంక్షన్‌ను షూట్‌ చేసి, అక్కడికక్కడే ఆన్‌లైన్‌ ద్వారా లైవ్‌ టెలికాస్ట్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాము. అంతేకాకుండా ఆ తరువాత కూడా డిజిటల్‌ ప్రమోషన్‌లో కూడా ఆ ఈవెంట్‌ను అందరికీ చేర్చాలన్నది మా ప్రయత్నం.

 

విజయ ఆసూరి - అడ్వయిజర్‌, బాటా

తెలుగు టైమ్స్‌ పత్రిక, బాటా రెండు 20 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి తెలుగు భాషను నేర్పించే పాఠశాలను ఈ దేశానికి అందించాయి. తెలుగు టైమ్స్‌.. బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు  ప్రతిపాదన మాకు బాగా నచ్చింది. తప్పనిసరిగా ఈ బిజినెస్‌ అవార్డు వేదిక ఒక ముఖ్యమైన వేదిక అవుతుంది అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించటానికి మేము సిద్ధంగా ఉన్నాం.

జే.పీ వేజెండ్ల - ఐటీ ఎంట్రప్రెన్యూరర్‌

తెలుగు టైమ్స్‌ బిజినెస్‌ అవార్డు ప్రతిపాదన తెచ్చాక మొదటగా నేను ఆలోచించింది దీనివల్ల  కమ్యూనిటీకి ఏమైనా లాభం ఉందా? కమ్యూనిటీ ఇంపాక్ట్‌ ఎంత వరకు ఉంటుంది అని ఆలోచించాను. తప్పకుండా విజయవంతం అయిన బిజినెస్‌లను గుర్తించడం వలన, బిజినెస్‌ కమ్యూనిటీలోనే ఒక విధమైన ఉత్సాహం వస్తుంది అని, యంగ్‌ ఎంట్రప్రెన్యూరర్‌కి స్ఫూర్తిగా ఉంటుంది అని అనిపించింది.

వెంకట రమణ గన్నె - ఎంట్రప్రెన్యూరర్‌, న్యూజెర్సి

తెలుగు టైమ్స్‌ పత్రిక మొదలు పెట్టిననాటి నుంచి తెలుసు. అలాగే ఎడిటర్‌ సుబ్బారావు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ తెలుగు టైమ్స్‌ను తెలుగు కమ్యూనిటీకి దగ్గర చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్‌ అవార్డు కార్యక్రమం కూడా చాలా మంచి ఆలోచన.  నేను స్వయంగా మా న్యూజెర్సీ ఏరియాలో అనేక మందికి చెప్పి వాళ్ల చేత నామినేషన్‌ వేయిస్తున్నాను.

రాజు చింతల - సిఇఓ,

ఇండియానా ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

తెలుగు కమ్యూనిటీ అమెరికాలో 20 ఏళ్ళుగా ఎలా పెరుగుతోందో, అందులో తెలుగు బిజినెస్‌ ఓనర్స్‌ ఏ విధంగా పెరుగుతున్నారో చూస్తున్నాను.  అనేక మంది తెలుగువారు పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. ఇంకా అనేక మంది కంపెనీలు ప్రారంభించడం, లేదా రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం, ఇతర ట్రేడిరగ్‌లలో పాల్గొనడం వంటివి చేస్తున్నారు. అలాంటి తెలుగు బిజినెస్‌ కమ్యూనిటీకి అవార్డులు ఇవ్వాలని ముందుకు వచ్చిన తెలుగు టైమ్స్‌కి అభినందనలు.

 మురళి చిరాల - ఫాల్కన్‌ ఎక్స్‌

ఫాల్కన్‌  ఎక్స్‌ అనేది బే ఏరియాలో కొంత మందితో కలిసి ప్రారంభిం చిన ఫ్యాకల్టీ సెంటర్‌. ఇక్కడ అనేక మంది ఐటీ పెద్దవాళ్ళు వస్తు ఉంటారు. ప్రారంభ దశలో ఉన్న యంగ్‌ ఐటీ ఎంట్రప్రెన్యూరర్స్‌కి, స్టార్టప్‌ లు చేయాలనుకునేవారు కూడా ఇక్కడకు వస్తూ ఉంటారు. తెలుగు టైమ్స్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు వేడుకకు ఫాల్కన్‌ ఎక్స్‌ వెన్యూ పార్టనర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం బాగా జరుగుతుందని భావిస్తున్నాను.

భరత్‌ ముప్పిరాల

సాఫ్టవేర్‌ ప్రొఫెషనల్‌, ఒరాకిల్‌

నేను తెలుగు టైమ్స్‌ని 20 ఏళ్లుగా చూస్తున్న తెలుగువాడిని తెలుగు టైమ్స్‌ బిజినెస్‌ అవార్డులను ఇస్తున్నట్లు ప్రకటించగానే ఇది ప్రత్యేకంగా ఉంటుందని అనిపించింది. ఈ అవార్డు ఫంక్షన్‌ను చూసి అందరిని కలవాలని  భావిస్తున్నాను.

 

 

Tags :