ఇండియానాపోలిస్‌లో ఘనంగా టీటీఏ మెగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో ఇండియానాపోలిస్ వేదికగా నిర్వహించిన మెగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగిశాయి. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కోచైర్ డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, భరదత్ మాదాడి, టీటీఏ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి, జనరల్ సెక్రటరీ, జాతీయ బతుకమ్మ అడ్వైజర్ కవిత రెడ్డి నేతృత్వంలో ఈ ఏడాది అమెరికా వ్యాప్తంగా పలు స్టేట్స్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. వీటన్నింటికీ పెద్ద సంఖ్యలు తెలంగాణ మహిళలు, చిన్నారులు హాజరై విజయవంతం చేశారు. ముఖ్యంగా ఇండియానాపోలిస్‌లో నిర్వహించిన మెగా బతుకమ్మ వేడుకలకు వెయ్యిమందికి పైగా తెలుగు మహిళలు హాజరై బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలు మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యాయి. ఢోల్‌తో మొదలైన ఈ వేడుకల్లో 50 అందమైన బతుకమ్మల చుట్టూ మహిళలు నృత్యం చేశారు. టీటీఏ ఇండియానాపోలిస్ మహిళలంతా కలిసి ఏడు అడుగుల ఎత్తయిన బతుకమ్మను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ వేడుకల్లో బెస్ట్ డ్రెస్, బెస్ట్ బతుకమ్మ తదితర బహుమతులను టీటీఏ అందజేసింది. ఈ వేడుకలు విజయవంతం కావడంలో ఎంతో సహకరించిన వాలంటీర్లకు, అందమైన బతుకమ్మలతో ఈ వేడుకలను సుందరంగా మార్చిన మహిళలకు టీటీఏ ధన్యవాదాలు తెలియజేసింది.
ఇండియానా నుండి టిటిఎ లీడర్‌షిప్ టీమ్: డా. విజయపాల్ రెడ్డి - టీటిఎ సలహా మండలి చైర్ మరియు కవిత రెడ్డి, జనరల్ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, టిటిఎ ఇండియానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్: రవీందర్ రెడ్డి పురుమాండ్ల తదితరులు ఈ వేడుకలు విజయవంతం కావడానికి సహకరించారు.