ASBL Koncept Ambience

టిటిఎ మెగా కన్వెన్షన్‌ కమిటీల ప్రణాళికలు...

టిటిఎ మెగా కన్వెన్షన్‌ కమిటీల ప్రణాళికలు...

విజయవంతంగా ముగిసిన ఆల్‌ కమిటీ మీటింగ్‌

న్యూజెర్సిలో తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టిటిఎ) మెగా కన్వెన్షన్‌ ను మే 27 నుంచి మే 29 వరకు  మధ్య (మెమోరియల్‌ డే వీక్‌ ఎండ్‌) న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మెగా కన్వెన్షన్‌కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలతో ఫిబ్రవరి 26వ తేదీన న్యూజెర్సిలోని ఐసెలిన్‌లో ఉన్న ఎపిఎ హోటల్‌లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టిటిఎ ముఖ్య నాయకులతోపాటు, 200 మందికిపైగా కమిటీ సభ్యులు హాజరయ్యారు. కన్వెన్షన్‌కు సంబంధించిన ప్రణాళికలపై ఇందులో చర్చించారు.
డాక్టర్‌ పైళ్ల మల్లా రెడ్డి (వ్యవస్థాపకుడు), డాక్టర్‌ విజయపాల్‌ రెడ్డి (అడ్వయిజరీ కమిటీ` చైైర్‌), డాక్టర్‌ హరనాథ్‌ పొలిచెర్ల (అడ్వయిజరీ కమిటీ-కో-ఛైర్‌) మార్గదర్శకత్వంలో న్యూజెర్సీ బృందం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం డాక్టర్‌ మోహన్‌ రెడ్డి పాటలోల్ల, ప్రెసిడెంట్‌, శ్రీనివాస్‌ గనగోని, కన్వీనర్‌, గంగాధర్‌ వుప్పల (కోఆర్డినేటర్‌), ఎనర్జిటిక్‌ న్యూజెర్సి టీమ్‌లో సతీష్‌ మేకల (బిఓడి), శివా రెడ్డి(బిఓడి), కిరణ్‌ దుగ్గగి (బిఓడి), నరేందర్‌ రెడ్డి (ఆర్‌విపి), నర్సింహ పెరుక (ఆర్‌విపి), దీప జలగం (డబ్ల్యుసి.), సుధాకర్‌ ఉప్పల (ఎస్‌సి), దాము గేదల (కన్వెన్షన్‌ అడ్వైజర్‌), సంతోష్‌ పాతూరి (కన్వెన్షన్‌ అడ్వైజర్‌). కన్వెన్షన్‌ కమిటీ అధ్యక్షులు: విజయ్‌ భాస్కర్‌ కలాల్‌, కృష్ణ సిద్ధాడ, రామ్‌ మోహన్‌ చిన్నాల, మహేందర్‌ నరాల, ఉషా చింత, స్వాతి అట్లూరి కలాల్‌, రవి కామరాసు, ప్రవీణ్‌ గూడూరు, గోపి వుట్కూరి, విలాస్‌ జంబుల తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కమిటీ సభ్యులంతా హాజరవడంతో ఈ సమావేశం విజయవంతంగా జరిగింది.

ప్రణాళికా సమావేశానికి హాజరైన అన్ని కమిటీల నాయకులు, న్యూజెర్సి కన్వెన్షన్‌ కమిటీల అధ్యక్షులు/ సహాధ్యక్షులు/సలహాదారులు/సభ్యులు తమ ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా శ్రీనివాస్‌ గనగోని (కన్వీనర్‌) స్వాగతం పలికారు. వివిధ కమిటీలు తమ ప్రణాళికలు మరియు బడ్జెట్‌ను ప్యానెల్‌కు సమర్పించాయి. ఈ సందర్భంగా దీనిపై నాయకత్వం నుండి కూడా వివరణలు అందుకున్నాయి.

అలంకారాలు, సాంస్కృతిక, ఆహారం, ఎవి, ఆతిథ్యం, రిజిస్ట్రేషన్‌, రిసెప్షన్‌, రవాణా, సావనీర్‌, ఆధ్యాత్మికం, ప్రోగ్రామ్‌ఈవెంట్‌, అవార్డులు, వెబ్‌, ఉమెన్‌ ప్రోగ్రామ్స్‌, బిజినెస్‌, స్టార్టప్‌, సెలబ్రిటీ కో ఆర్డినేషన్‌, వెండర్స్‌ అండ్‌ ఎగ్జిబిట్స్‌, కార్పొరేట్‌, టీటిఎ స్టార్‌, బాంక్వెట్‌, పొలిటికల్‌ ఫోరమ్‌, మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌ కమిటీలు ఈ సమావేశంలో తమ ప్రణాళికలను వివరించారు.

వంశీ రెడ్డి (అధ్యక్షుడు), సురేష్‌ వెంకన్నగారి (ఇవిపి), శ్రీనివాస్‌ మానాప్రగడ (జనరల్‌ సెక్రటరీ), పవన్‌ రవ్వ (కోశాధికారి), కవితా రెడ్డి (జాయింట్‌ సెక్రటరీ) మాధవి సోలేటి (ఎథిక్స్‌)తోపాటు పలువురు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు,ఎస్‌సి, ఆర్‌విపిలు, ఆర్‌సిలు, న్యూయార్క్‌, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు టిటిఎ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన మినిట్‌ టు మినిట్‌ కార్యక్రమం రాత్రి 7.30 గంటల వరకు సాగింది. ఈ సమావేశాన్ని కార్పొరేట్‌ తరహాలో ఏర్పాటు చేశారు. రుచికరమైన భోజనంతో కూడిన కాక్‌టెయిల్స్‌తో కార్యక్రమం ముగిసింది. స్థానిక గాయకులు తమ మధురమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సమావేశాన్ని చక్కగా నిర్వహించిన టిటిఎ న్యూజెర్సి టీమ్‌ను అందరూ అభినందించారు. ఈ ఆల్‌కమిటీ ప్రణాళికా సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రెసిడెంట్‌ మరియు కన్వీనర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

 

Click here for Photogallery

 

Tags :