సియాటెల్ లో డా.వడ్డేపల్లి కృష్ణకు సత్కారం
అమెరికాలోని సియాటెల్‌లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మహాసభలు జరిగాయి. మహాసబలకు సంబంధించిన స్వాగత గీతాన్ని వడ్డేపల్లి కృష్ణ రచించారు. గీతానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చగా వందలాది మంది నర్తకీమణులతో వేదికపై ప్రదర్శించారు. ఈ సందర్భంగా రచయిత వడ్డేపల్లి కృష్ణను నిర్వహకులు పైళ్ల మల్లారెడ్డి, విజయపాల్‌రెడ్డి, వంధీధర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ అమెరికాలో సన్మానం పొందడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తెలుగు భాష సంస్కృతి విశ్వవ్యాప్తం కావడం ఆనందకరమని అన్నారు. అమెరికాలో తెలుగువారు తెలుగు కోసం పరితపిస్తున్నారని అన్నారు. విశ్వవేదికపై తన సాహిత్యాన్ని ప్రదర్శించడం సంతోషంగా ఉందని, అష్టావధానం నిర్వహించారని తెలిపారు. ఇలాంటి వేడుకల ద్వారా తెలుగు బాష, సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి పరిచయమవుతాయని ఓ ప్రకటనలో తెలిపారు.