ASBL Koncept Ambience

టిటిఎ మెగా కన్వెన్షన్... దేవిశ్రీ ప్రసాద్ లైవ్ సంగీత కచేరి

టిటిఎ మెగా కన్వెన్షన్... దేవిశ్రీ ప్రసాద్ లైవ్ సంగీత కచేరి

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌కు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా కన్వెన్షన్‌ కోసం ఏర్పాటైన కమిటీలు తమకు కేటాయించిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ కన్వెన్షన్‌లో ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలు కూడా ఉన్నాయి. ప్రముఖ తెలుగు సినీ, టీవీ కళాకారుల నృత్యం, గానం ప్రదర్శనలతో కూడిన స్థానిక మరియు అంతర్జాతీయ ప్రముఖ కళాకారులచే తెలంగాణ మరియు తెలుగు ఫుట్‌టాపింగ్‌ ప్రదర్శనలను కన్వెన్షన్‌లో ఏర్పాటు చేస్తున్నారు.

లెజెండరీ సింగర్‌ బాలసుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌, ఎస్పీ శైలజతోపాటు ఉష, సింగర్‌ సునీత, కాప్రిసియో బ్యాండ్‌ ద్వారా మ్యూజికల్‌ షో వంటివి ఏర్పాటు చేశారు. ఈ మెగా కన్వెన్షన్‌లో హైలైట్‌గా దేవిశ్రీ ప్రసాద్‌ లైవ్‌ సంగీత కచేరి నిలవనున్నది. రాక్‌స్టార్‌ తన సంగీతంతో కన్వెన్షన్‌కు వచ్చినవారిని ఆనందపరచనున్నారు. రంజిత్‌, సాగర్‌, గీత, రీట, మౌనిమ తదితరులు ఈ లైవ్‌ సంగీత కార్యక్రమంలో పాటలు పాడి అందరినీ ఆకట్టుకోనున్నారు. ఈ మెగా కన్వెన్షన్‌కు అందరూ రావాలని ప్రెసిడెంట్‌ మోహన్‌ పాటలోళ్ళ కోరారు.

 

Tags :