టిటిఎ 2వ రోజు కార్యక్రమాలు విజయవంతం
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మెగా కన్వెన్షన్ సియాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో 2వ రోజు కూడా వివిధ కార్యక్రమాలతో ప్రారంభమైంది. టిటిఎ వ్యవస్థాపకులు పైళ్ళ మల్లారెడ్డి, ప్రెసిడెంట్ వంశీ రెడ్డి, విజయ్ పాల్ రెడ్డి, మోహన్ రెడ్డి పాటలోళ్ల, భరత్ రెడ్డి మాదాడి, కన్వీనర్ చంద్రశేఖర్ శ్రీరామోజు, ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది, కన్వెన్షన్ కో ఆర్డినేటర్ మాణిక్యం తుక్కారపు తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలను జరిపారు.
2వ రోజు ఉదయం హయ్యత్ నుంచి సియాటెల్ కన్వెన్షన్ సెంటర్ వరకు పెరేడ్ నిర్వహించారు. అమెరికా, భారత జాతీయ గీతాలాపన చేశారు. తరువాత స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను జరిపారు. సినీపాటల నృత్యాలు, ఇతర కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఫ్యాషన్ షో, బిజినెస్ సెమినార్, పెళ్ళి పరిచయ వేదిక, సిఎంఇ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆయా రంగాల్లో నిష్ణాతులైన పలువురు పాల్గొని ప్రసంగించారు. బ్యూటిపేజియంట్ ఫైనల్ పోటీలు జరిగాయి. సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా అష్టావధాన కార్యక్రమం జరిగింది. టెక్నాలజీకి సంబంధించి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. యూత్ కోసం కూడా పలు కార్యక్రమాలను నిర్వహించారు. యూత్ టాలెంట్ షో, ఎఐ కార్యక్రమాలు, స్టార్టప్ కార్యక్రమాలు యూత్‌కు ఉపయోగపడేలా నిర్వహించారు. మహిళలకోసం కూడా పలు కార్యక్రమాలు జరిగాయి. ప్యానల్ డిస్కషన్స్, సేవలందించి మహిళలను సన్మానించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు 2వ రోజున జరిగాయి.
2వ రోజు కార్యక్రమాల్లో కూడా పలువురు ప్రముఖులు ప్రసంగించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి చామకూర తదితరులు ప్రధాన వేదికపై ప్రసంగించారు.
Click here for for Photogallery - Part 1
Click here for for Photogallery - Part 2