ASBL Koncept Ambience

టిటిఎ మెగా కన్వెన్షన్ వేడుకలు...ఘనంగా జరిగిన బాంక్వెట్ వేడుకలు

టిటిఎ మెగా కన్వెన్షన్ వేడుకలు...ఘనంగా జరిగిన బాంక్వెట్ వేడుకలు

న్యూజెర్సీలో జరుగుతున్న తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ సంబరాలు బాంక్వెట్‌ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. మహాగణపతి నృత్యగీతంతో కార్యక్రమాలు ప్రారంభించారు. నృత్యమాధవి స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌కు చెందిన శ్రీమతి దివ్యఏలూరి శిష్యులు ఈ నృత్యగీతాన్ని చేశారు. తరువాత విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను అందజేశారు. శ్రీమతి స్వాతి అట్లూరి టీమ్‌ ఇదేరా తెలంగాణ పేరుతో డ్యాన్స్‌ కార్యక్రమం చేశారు. డోనర్లను సత్కరించారు.

ఈ కన్వెన్షన్‌ ను పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా పరిసరాలను తీర్చిదిద్దారు బ్యాంక్వెట్‌ విందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణాకు చెందిన ఎంపీలు డి అరవింద్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌ రెడ్డి వివిధ పార్టీల నాయకులు డీకే అరుణ, మధుయాష్కి, మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. టిటిఎ వ్యవస్థాపక అధ్యక్షుడు పైళ్ల మల్లారెడ్డి, అధ్యక్షుడు పటోళ్ల మోహన్‌ రెడ్డి, కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌ గనగొని శ్రీనివాస్‌ తదితరులు ప్రసంగించారు. యాంకర్‌ సుమ సంధానకర్తగా వ్యవహరించారు. చివరన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. ఎంతగానో ఆకట్టుకున్న ఈ సంగీత విభావరి టిటిఎ బాంక్వెట్‌ కార్యక్రమంలో హైలైట్‌గా నిలిచింది.

Click here for Event Gallery

 

 

Tags :