విద్యారంగ అభివృద్ధికి పైళ్ళ మల్లారెడ్డి కృషి అనిర్వచనీయం : వలిగొండలో టిటిఎ నాయకులు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్వహిస్తున్న సేవాడేస్‌లో భాగంగా యాదాద్రి జిల్లా వలిగొండలో టిటిఎ నాయకులు పర్యటించారు. టిటిఎ ఫౌండర్ పెల్ల మల్లారెడ్డి గారు స్వయంగా నిర్మించిన వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాలలో అభివృద్ధి కార్యక్రమం మరియు విద్యార్థులతో మాట ముచ్చట నిర్వహించారు. మల్లా రెడ్డి గారు స్వయంగా స్వంత స్థలంలో స్వంత నిధులతో ఈ కళాశాలను నిర్మించి ప్రభుత్వానికి అందించడం జరిగింది. కళాశాలకు కావలసిన అన్ని ఫర్నిచర్, కంప్యూటర్, డిజిటల్ క్లాస్ రూం లు ఏర్పాటు చేశారు. పైల్ల మల్లారెడ్డి గారు నడిచే దేవుడని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ అన్నారు.
రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన కళాశాలగా మార్చడంలో పైల్ల మల్లారెడ్డి గారు చేసిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సాధన అనే ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి ఈ కళాశాల ఇక్కడ నిర్మించడం వల్లే మహిళా విద్య సాధ్యమైందని తెలిపారు. ఒక్కమాటతో 40లక్షల రూపాయలతో కళాశాల అభివృద్ధి పనులు చేసేందుకు ఇచ్చిన పైల్ల మల్లారెడ్డి గారు తమకు దేవునితో సమానం అని తెలిపారు. కావ్య అనే ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి మాట్లాడుతూ అడగగానే మా కాలేజ్ కి ఇంత సహాయం చేసిన పైల్ల మల్లా రెడ్డి గారి ఆశయాలు సాధిస్తామని తెలిపారు.
టిటిఎ సేవా డేస్ కో ఆర్డినేటర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలాంటి విద్య సంబంధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఒక ఆత్మ సంతృప్తి ఉంటుందని అన్నారు. టిటిఎ సభ్యులను పరిచయం చేశారు.
టిటిఎ ప్రసిడెంట్ వంశీ రెడ్డి గారు మాట్లాడుతూ పైల్ల మల్లారెడ్డి గారు కళాశాల కే కాదు మా టిటిఎకు కూడా దేవుడే అని అన్నారు. సుంకిశాల ముద్దుబిడ్డ ఎవరు అంటూ ప్రశ్నించిన వంశీ గారికి విద్యార్థుల నుండి స్పందనగా పైల్ల మల్లారెడ్డి అని బిగ్గరగా చెప్పారు. థాంక్స్ మల్లన్న అంటూ పిల్లలు తమ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఒక్కొక్కరిని ఏమవుతారు అని అడిగి తెలుసుకున్నారు.
టిటిఎ స్టాండింగ్ కమిటీ మెంబర్ వాణీ గారు మాట్లాడుతూ కాలేజ్ లో చదివి లిమిటేషన్స్ లేకుండా చదువు లో ముందుకు సాగాలని కోరారు. లైఫ్ ఎవ్వరికీ ఈసి కాదని తెలిపిన ఆమె..ఎదిగిన అందరి ప్రయాణం తెలుసుకోవాలని కోరారు. మీకు కావల్సిన అన్ని విషయాలకు సాయం చేస్తాం అని తెలిపారు. మీ సక్సెస్ లో మల్లన్న సక్సెస్ ఉందని అన్నారు.
టిటిఎ జనరల్ సెక్రటరీ కవిత రెడ్డి గారు మాట్లాడుతూ తన జీవిత ప్రయాణం గురించి వివరించారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరుకలిసి చదివి పైకి రావాలని కోరారు. టిటిఎ బృందం కళాశాల ప్రిన్సిపాల్ ను శాలువాతో సన్మానించి మేమొంటోతో సత్కరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు సిరివెన్నెల, హరిత చేసిన నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది.