టీ హబ్‌లో టిటిఎ సదస్సు విజయవంతం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలంగాణలో నిర్వహిస్తున్న సేవాడేస్ లో భాగంగా హైదరాబాద్ లోని టీ హబ్ లో Startup Eco System in Telangana, Investment Opportunities in Tier 2 Cites in Telangana, Evolution of Al and its Impact అనే అంశాలపై సెమినార్ నిర్వహించింది. ఈ సెమినార్‌లో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ రమేష్ లోకనాధన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సెమినార్ ద్వారా టిటిఎ అనుకున్న లక్ష్యం నెరవేరినట్లు కనిపించింది.
ఇందులో పాల్గొన్న యువ పారిశ్రామిక వేత్తల సమూహాన్ని చూస్తే అందరూ చిన్న చిన్న కుగ్రామాల నుండి అగ్రదేశాల శిఖరాలను అదిపుచ్చుకున్న శ్రమైక జీవన సారదులు. మహిళా పారిశ్రామిక వేత్తల గళం కార్యక్రమాన్ని మరో మెట్టు పైకి ఎదిగేలా ఈ సెమినార్ చేసింది. సేవా డేస్ ప్రోగ్రాం లో హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి సేవలందిస్తున్నారు. తను తనదైన శైలిలో తన ప్రయాణం వరంగల్ లోని ఒక మారుమూల కుగ్రామం నుండి అరిజోనా లోని ఫీనిక్స్ కు చేరిన తీరును క్లుప్తంగా వివరించి యువ పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకున్నారు. ఒక మహిళగా కుగ్రామం నుండి విదేశాలలో ఎంప్లాయిమెంట్ సృష్టించిన ఆమె విజయ గాథ అందరినీ అకట్టుకుంది. ఒక్కొక్కరిది ఒక్కోక్క విజయ గాధ. టిటిఎ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి, ద్వారక నాద్ గారు, ఇలా ఎంతో మంది తమ ప్రయాణాన్ని కుగ్రామాల నుండి విదేశీ విహంగాలు వీక్షించిన వారే. ఇక్కడ నుండి ప్రతి ఒక్కరూ ఇచ్చేది ఒకటే సందేశం. తెలంగాణలో మేము వచ్చిన కుగ్రామాల్లోని యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే. ముఖ్య అతిథి రమాదేవిని టిటిఎ జాయింట్ సెక్రటరీ శివారెడ్డి కొల్ల పరిచయం చేసారు. మరో ముఖ్య అతిధి జయేష్ రంజన్ వర్చువల్ గా అటెండ్ కాగా వారిని టిటిఎ ట్రెజరర్ మనోహర్ బోడ్కె పరిచయం చేశారు.
వర్చువల్ గా మాట్లాడిన జయేష్ రంజన్ ఎఐ లో చేయాల్సిన కృషిని వివరించారు. తదనంతరం సభను అడ్రస్ చేసిన ముఖ్య అతిది రమాదేవి మాట్లాడుతూ, ఈ సమాజం లో ఉన్న అతి పెద్ద సమస్య ఆక్సిడెంటల్ మరణాలని అవి రోడ్డు పై జరిగి పూర్తి కుటుంబాలను రోడ్డు పైకి లాగుతున్నాయని తెలిపారు. రైతు బంధు, ధరణి లాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలలో ఎఐ తన సత్తా చాటాల్సిన అవసరాన్ని గుర్తు చేసారు. రమేష్ లోకనాధన్ ఎకో సిస్టమ్ గురించి వివరించారు. భారత్ లో జరుగుతున్న అనేక రీసెర్చ్ ల గురించి వివరించారు. టిటిఎ నుండి జ్యోతిరెడ్డి దూదిపాల ముఖ్య అతిథి రమాదేవిని శాలువాతో మరియు బొకే తో సన్మానించారు. మరో ముఖ్య అతిథిగా వచ్చిన ప్రొఫెసర్ రమేష్ ను టిటిఎ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ డా. డి ద్వారకనాథ రెడ్డి శాలువాతో సన్మానించారు. కార్యక్రమాన్ని తన భుజస్కందలపై నడిపించిన టిటిఎ ప్రసిడెంట్ వంశీ రెడ్డి గారు చివరగా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి, ఇండియా కోఆర్డినేటర్ గా డా. డి ద్వారకనాథ రెడ్డి, కో కో ఆర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం, ఇంటర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ ప్రసాద్ కునారపు, హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ జ్యోతిరెడ్డి దూదిపాల, నర్సింహా పెరుక కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రసిడెంట్ గా వంశిరెడ్డి కంచరకుంట్ల మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది, కార్యదర్శిగా కవితారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.