టిటిఎ సేవాడేస్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, అమెరికాలోని తెలంగాణవారికోసం ఏర్పడిన జాతీయ తెలంగాణ సంఘం టిటిఎ. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం పేరుతో ఉన్న ఈ టిటిఎ తెలంగాణ సంస్కృతిని, వైభవాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలను అమెరికాలో చేస్తోంది. వచ్చే సంవత్సరం సియాటెల్‌లో నిర్వహించే మహాసభలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో సేవాడేస్ పేరుతో కార్యక్రమాలను డిసెంబర్ 11 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించింది. హైదరాబాద్, నల్లగొండ, భోనగిరి, సిద్దిపేట్, వికారాబాద్, గజ్వేల్, హనుమకొండ, వరంగల్, యాదగిరిగుట్ట, వలిగొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సేవా డేస్ కార్యక్రమాలు జరిగాయి.
టిటిఎ ఫౌండర్ పైళ్ళ మల్లారెడ్డి, టిటిఎ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరిగిన సేవా డేస్ కార్యక్రమాలకు కో ఆర్డినేటర్‌గా సురేష్ రెడ్డి వెంకన్నగరి, ఇండియా కో ఆర్డినేటర్ డా. డి. ద్వారకనాథ్ రెడ్డి, కో కో ఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ సెలోజ్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కూనరపు, ఫౌండేషన్ సర్వీస్ చైర్ సంతోష్ గంటారాం, కమ్యూనిటీ సర్వీస్ చైర్ నరసింహ పెరుక, హెల్త్ అండ్ వెల్ నెస్ అడ్వయిజర్ జ్యోతి రెడ్డి దూదిపాల, ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, జనరల్ సెక్రటరీ కవితా రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.