ఆరోగ్య సదస్సుతో టిటిఎ కార్యక్రమాలు ప్రారంభం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) తెలుగు రాష్ట్రాల్లో సేవా డేస్ పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి రోజు సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా తొలి కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రెడ్ క్రాస్ గౌట్ స్కూల్ లో నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సుమిత్ర వారి ఎన్‌సిసి బృందంతో టిటిఎ సంఘం సభ్యులను సాదరంగా ‘‘గాడ్ ఆఫ్ ఆనర్’’ మార్చ్ ఫాస్ట్ ద్వారా స్వాగతం పలికారు. తదనంతరం స్వయంగా సుమిత్ర వారి అధ్యాపక బృందంతో సభ్యులను వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. టిటిఎ అధ్యక్షులు వంశీ రెడ్డి సభకు అధ్యక్షులుగా వ్యవహరించారు.
స్కూల్ పిల్లల ఆట పాటలతో కార్యక్రమం ఆహ్లాదకరంగా మారింది. చిరంజీవి హారిక పడిన ‘‘యెట్టగయ్య శివ శివ’’ అనే పాట ఆహుతులను ముఖ్యంగా సభ్యులను ఆకట్టుకుంది. మరో విద్యార్థిని కీర్తన ‘‘పాటమ్మతోనే’’ అనే పాట తో ఆహుతులను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ ఇద్దరికీ టిటిఎ నుండి నగదును బహుమతిగా అందించారు. కార్యక్రమంలో పిల్లలకు డెంటల్ చెకప్, డెంటల్ కిట్స్, శానిటరీ పాడ్స్, ఉమన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికీ ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. అమర దేవి అనే ఒక చిన్నారి జిమ్నాస్టిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిందని తెలుసుకున్నా టిటిఎ ప్రసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల 5వేల నగదు బహుమతి ఇచ్చి ఆశీర్వదించారు. రానున్నరోజుల్లో ఒలింపిక్స్ లో ఆడేలా కృషి చేయాలని ప్రోత్సహించారు.
అధ్యక్షులు వంశీ రెడ్డి మాట్లాడుతూ.. రేపటి దేశ భవిష్యత్తు ఈ రోజు నవతరమని వారి ఆరోగ్యం పదిలపరచడం మన దేశ భవిష్యత్తు తో ముడి పడి ఉందన్నారు. అందుకే టిటిఎ వారి ఆరోగ్యం పౌష్ఠికాహారంపై దృష్టి సారించింది అని తెలిపారు. డా. రచన డెంటల్ హెల్త్ గురించి పిల్లలకు సోదాహరణంగా వివరించారు. డా మధులిక ఉమన్ హెల్త్ మరియు న్యుట్రిషన్ గురించి వివరించారు. డిఇఓ వెంకటేశ్వర్లు గారికి, ప్రిన్సిపాల్ సుమిత్ర గారికి మరియు పాఠశాల అధ్యాపకులకు టిటిఎ బృందం శాలువా మరియు బోకే తో పాటు మేమొంటోలు అందజేసి సత్కరించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది.
సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి, ఇంటెర్నేషనల్ కోఆర్డినేటర్ గా డా. డి ద్వారకనాథ రెడ్డి, కో-కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం, ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు, హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల, నర్సింహా పెరుక` కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రెసిడెంట్ గా వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది మరియు కార్యదర్శిగా కవితారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సభ్యులు శివారెడ్డి కొల్లా, మనోహర్ బొదుకే, ప్రదీప్ మెట్టు, సంగీత రెడ్డి బొర్రా, వెంకట్ గడ్డం, ప్రదీప్ బొద్దు, అభిలాష్ రెడ్డి, అనిల్ అర్రబల్లి, వాణి గడ్డం, శ్రీధర్ చదువు, ఆహ్లాదరెడ్డి కారెడ్డి, గణేష్ మాధవ్ వీరమనేని మరియు కవితారెడ్డి సేవా డేస్ లో పాల్గొన్నారు.