నల్లగొండ జిల్లాలో టీటీఏ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
టీటీఏ సేవాడేస్ కార్యక్రమాల్లో భాగంగా నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ఆలయ నిర్మాణానికి టిటిఎ నాయకులు సహకారం అందించి ప్రారంభించారు. గణేశ్ మాధవ్, వీరమన్ (గని) ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అలాగే గ్రామంలోని పేదలకు దుప్పట్లను కూడా టిటిఎ నాయకులు పంపిణీ చేశారు. టీటీఏ ఎథిక్స్ కమిటీ డైరెక్టర్ గణేష్ వీరమనేని స్వగ్రామం నల్గొండ జిల్లా, పెండ్లిపాకల గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయ ప్రారంభోత్సవంలో టీటీఏ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పేద ప్రజలకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న టీటీఏ సంస్థను గ్రామ ప్రజలు కొనియాడారు. కార్యక్రమంలో టిటిఎ ముఖ్య నాయకులు పలువురు పాల్గొన్నారు. టిటిఎ ప్రెసిడెంట్ కంచరకుంట్ల వంశీ రెడ్డి, ప్రెసిడెంట్-ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, సేవా డేస్ కోఆర్డినేటర్ వెంకన్నగారి సురేష్ రెడ్డి, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ నర్సింహ పెరుక, జాయింట్ ట్రెజరర్ మనోహర్ బోడ్కే, మయూర్ బండారు చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు, ఇతరులు టీటిఎ నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.