ASBL Koncept Ambience

తుమ్మంపేటలో టీటిఎ సేవ కార్యక్రమం..

తుమ్మంపేటలో టీటిఎ సేవ కార్యక్రమం..

తెలంగాణలో టిటిఎ సేవాడేస్‌లో భాగంగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా తుమ్మంపేటకు చేరుకుంది. టిటిఎ నాయకులు సైదులు స్వగ్రామంలో ప్రభుత్వ స్కూల్‌ కు సంబంధించి స్టేజ్‌ నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలకు అందించడం జరిగింది. పాఠశాలలో గణిత శాస్త్ర నిపుణులు రామానుజం గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గణిత ప్రయోగాలను టిటిఎ నాయకులు మనోహర్‌ మరియు నరసింహ పేరుక  తిలకించారు..విద్యార్థుల ప్రతిభకు అబ్బురపడి పిల్లలను అభినందించారు. ఉత్సాహంగా స్కూల్‌ పిల్లలు తాము స్వంతంగా తయారు చేసిన గణితసూత్రాలను వివరించే అట్ట యంత్రాలు పిల్లలకు చదువు పై  ఉన్న ఆసక్తి తెలియజేస్తుందని టిటిఎ ఇలాంటి ఆసక్తి గల పిల్లలను తప్పకుండా మరోసారి సందర్శించి వారికి అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు చేస్తామని చేస్తుందని నాయకులు మాట్లాడుతూ హామి ఇచ్చారు. టిటిఎ నాయకులకు స్కూల్‌ ఆచార్యులు శాలువాతో సన్మానించారు.

పాఠశాల ప్రధాన అధ్యాపకులు రవీందర్‌ మాట్లాడుతూ టిటిఎ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ మళ్ళీ చేయలనికొరారు.

రమేష్‌ ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఇప్పటి టిటిఎ నాయకులు పాఠశాలకు సేవలందించడం మంచి విషయమని తెలిపారు.

టిటిఎ సభ్యులకు ఫ్రెండ్స్‌ యూత్‌ ప్రసిడెంట్‌ అధ్యక్షుడు అనిల్‌ గౌడ్‌ మాట్లాడుతూ దన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థులకు ఇన్స్పిరేషన్‌ గా ఉన్న టిటిఎకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. నృత్యం చేసిన విద్యార్థులను నాయకులు అభినందించారు.

గ్రామ పంచాయతీ సెక్రటరీ ఫజల్‌ గారు మాట్లాడుతూ ఇలాంటి సేవలందించినందుకు ధన్యవాదాలు తెలిపారు..ప్రభుత్వ పాఠశాల లో చదివే పిల్లలను  ఎలా పెంచాలి అనే విషయం పై రీసెర్చ్‌ చేయగలిగితే గొప్పగా ఉంటుందని తెలిపారు. 

టిటిఎ నాయకులు నరసింహ పెరుక మాట్లాడుతూ టిటిఎ ఏర్పడ్డ విధానం మరియు చేసిన సేవా కార్యక్రమాలు అన్నింటినీ వివరించారు. రానున్న రోజుల్లో ఈ స్కూల్‌ ను కూడా దత్తత తీసుకోనున్నామని తెలిపారు.

ప్రిన్సిపాల్‌ అడిగిన గ్రీన్‌ బోర్డ్‌ త్వరలో అందిస్తామని ప్రామిస్‌ తెలిపారు. పిల్లల సృజనాత్మక ఆలోచనలను ఆయన ప్రత్యేకంగా అభినదించారు.. మనోహర్‌ గారు మాట్లాడుతూ జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఈ స్టేజ్‌ నిర్మాణం జరగడం అద్భుతం అని అన్నారు. స్టేజ్‌ అనేది కేవలం ఒక ఇటుకల నిర్మాణం గా చూడొద్దని..అన్న ఆయన ఇది ఒక మంచి ఉపన్యాసకుడు,స్టేజ్‌ డ్రామా, కమిడియన్‌, ఇలా ఎంతో మందిని తయారు చేసే ఒక వేదికగా చూడాలని అన్నారు. పిల్లల్లో పిల్లవాడిగా కలిసి దాతల తల్లి తండ్రికి కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రామానుజం గురించి పిల్లలకు వివరించారు.

సర్పంచ్‌ తిరుపతి రావు మాట్లాడుతూ టిటిఎకు అభినందనలు తెలిపారు. టిటిఎ నాయకులు నరసింహ చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఇద్దరికీ శాలువా కప్పి సన్మానించారు. మెమొంటో అందించి 25వందల రూపాయలు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ధైర్య ప్రదర్శన చేసిన ముగ్గురు పిల్లలకు నాయకులు మనోహర్‌ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన ప్రతి క్లాస్‌ లో ముగ్గురు విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌ లు పంపిణీ చేసారు. కార్యక్రమానికి సహకరించిన బ్రహ్మచారికి హృదయపూర్వక అభినందనలు టిటిఎ నాయకులు నరసింహ పెరుక మరియు మనోహర్‌ తెలిపారు.

టిటిఎ నాయకులు ప్రధాన అధ్యాపకులు రవీందర్‌ గారితో పాటు రమేష్‌ పైమరీ టీచర్‌ ,దాతల లో ఒకరు సాయి గారి తండ్రి ఏర్రయ్య గారిని శోబాన్‌ గారి తండ్రి రఘుపతి గారిని, శ్యామ్‌ గారి బాబాయిని, ఆర్కిటెక్చర్‌ బ్రహ్మచారి గారిని మరియు సర్పంచ్‌ తిరుపతి రావు గారిని శాలువా తో సన్మానించి మెమొంటొ తో సత్కరించారు.

 

Click here for Photogallery

 

 

Tags :