ఈనాటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు.. నిజామాబాద్ జిల్లాలో టిటిఎ సేవాడేస్ కార్యక్రమం
నిజామాబాద్ జిల్లాలో టిటిఎ సేవాడేస్ కార్యక్రమాల్లో భాగంగా స్కూల్ పిల్లలలకు అవసరమైన సామాగ్రిని అందించే కార్యక్రమం గడ్డం వెంకట రెడ్డి అధ్వర్యంలో జరిగింది. ’బడిరా ఇది బడిరా చదువులమ్మ గుడిరా’’ అంటూ స్థానిక కళాకారుడు గంగాధర్ ఆలపించిన గీతం ఆకట్టుకుంది. టిటిఎ బృందం గ్రామంలోకి రాగానే గ్రామస్థులు శాలువాలతో సన్మానించి బోకెల తో స్వాగతం పలికారు.
కార్యక్రమం నిర్వాహకుడు గడ్డం వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించిన టిటిఎ నాయకులకు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. టిటిఎ ప్లాట్ ఫామ్ ఇచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చిన ఫౌండర్ మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
ముత్తకుంట గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ శివ చరణ్ మాట్లాడుతూ స్వంత గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న టిటిఎ బృందంకు ధన్యవాదాలు తెలిపారు.
టిటిఎ నాయకులు మోహన్ రెడ్డి పటోళ్ల మాట్లాడుతూ సహాయం చేయడం వెంకట్ గడ్డంకు ఉన్న ఒక మంచి అలవాటు అని తెలిపారు. టిటిఎ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు. టిటిఎకు మహిళా నాయకత్వం గర్వకారణం అని తెలిపారు.
అధ్యక్షులు వంశీ రెడ్డి గారు మాట్లాడుతూ గడ్డం వెంకట్ రెడ్డి ముత్తుకుంటకు సేవా కార్యక్రమాలు చేయడం సంతోషం కలిగించిందని తెలిపారు. 20 రోజుల నుండి సేవా కార్యక్రమాలు తెలంగాణ అంతటా చేశామని ఇకపై కూడా ఇవి కొనసాగిస్తామని తెలిపారు.
టిటిఎ జనరల్ సెక్రటరీ కవిత రెడ్డి మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని,గ్రామాన్ని వెంకట రెడ్డి ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు.
స్కూల్ టీచర్ రాధ గారు మాట్లాడుతూ మారుమూల గ్రామంలో డిజిటల్ క్లాస్ రూం లు TTA వల్లే జరిగిందని స్కూల్ కు ఉన్న అన్ని సౌకర్యాలు గడ్డం వెంకట్ రెడ్డి గారి ద్వారా అందినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తదనంతరం పండగ వాతావరణం లో పిల్లకు స్కూల్ బ్యాగ్స్ అందించిన TTA సభ్యుల అనందం వ్యక్తం చేశారు.
గడ్డం వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈసందర్భంగా ఇంటర్ టెన్త్ లో గ్రామంలో అత్యధిక మార్కులు సంపాదించిన పిల్లకు ప్రతి సంవత్సరం 15వెలు స్కాలర్ షిప్స్ ఇస్తానని ప్రకటించారు.