ASBL Koncept Ambience

జ్యోతి రెడ్డి అధ్వర్యంలో టీటీఏ క్యాన్సర్‌ క్యాంప్‌ జయప్రదం

జ్యోతి రెడ్డి అధ్వర్యంలో టీటీఏ క్యాన్సర్‌ క్యాంప్‌ జయప్రదం

మహిళా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న TTA
వీల్ చైర్స్ పంపిణీ చేసిన TTA జ్యోతి రెడ్డి గారు
TTA మహిళా నాయకురాలు జ్యోతి రెడ్డి అధ్వర్యంలో లో క్యాన్సర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది
TTA అడ్వైసరీ చైర్ మోహన్ రెడ్డి పటోళ్ల మరియు TTA ప్రసిడెంట్ చెరో లక్ష్య రూపాయలు మల్లికాంబ అనదాశ్రమనికి ఇచ్చారు

తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది. తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్.TTA founder Pailla Malla Reddy Garu, Advisory Consul chair - Vijayapal Reddy గారు, Co-chair - Mohan Patlolla గారు, Member: Bharat Madadi గార్ల ఆధ్వర్యంలో 2015 లో మొదలై, ప్రస్తుత ప్రసిడెంట్ వంశిరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్న తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్  తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవ డేస్ కార్యక్రమాన్ని ఈసంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ  ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు ప్రజలను కోరారు.

సేవకు మారుపేరు TTA నాయకురాలు జ్యోతి రెడ్డి గారు దివ్యాంగుల కు వీల్ చైర్స్ పంపిణీ చేసారు. దివ్యాంగులు చేసిన నృత్యాలు, పాటలు TTA సభ్యులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "మౌనంగానే ఏదగమని" అని పాడిన పాట TTA సభ్యులను ఆకట్టుకుంది.

సంఘం హోటల్ అధినేత చెంద్రశేఖర్ 50వేలు.. TTA ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మలిపెద్ది 50వేలు మల్లికాంబా మానసిక వికాస కేంద్రమునకు ఇచ్చారు.

TTA పై నెల్లుట్ల సుమన్  రాసిన "జయహో TTA" అనే పాట నిజాలను నిక్కచ్చిగా TTA చేసిన పనులను స్వచంగా ప్రజలకు తెలిపింది. కాకతీయ ఫోక్ బ్యాండ్ ఆలపించిన ప్రతి పాట అందరినీ ఆకట్టుకున్నాయి. రెలారే రెల శాలిని పాడిన పాట ఆహుతులను ఆకట్టుకుంది.

ఈరోజు వరంగల్ లో మెడికల్ క్యాంప్ లో TTA సభ్యులు పాల్గొన్నారు. TTA నాయకురాలు జ్యోతి రెడ్డి గారు స్వయంగా వీల్ చైర్ పంపిణీ చేసారు.

TTA నాయకురాలు జ్యోతి రెడ్డి గారు స్వయంగా రాసిన "ఐనా నేను వోడిపోలేదు" అనే పుస్తకాన్ని TTA నాయకులకు అందించారు జ్యోతి రెడ్డి గారు.

TTA నాయకులు విజయ్ పాల్ రెడ్డి గారు మాట్లాడుతూ దివ్యాంగులకు కావలసిన అన్ని రకాల సహాయక చర్యలు చేస్తామని తెలిపారు.

TTA నాయకులు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు.. దివ్యాంగులు కోసం ఏదైనా TTA చేస్తుందని తెలిపారు. ఒక లక్ష రూపాయల సాయం చేస్తా అని అన్నారు.

TTA ప్రసిడెంట్ వంశీ రెడ్డి గారు మాట్లాడుతూ జ్యోతి రెడ్డి గారు వ్యవసాయ కులి గా పనిచేసి ఇప్పుడు అమెరికాలో యువతకు కూడా ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు అని ఆమె స్వంత గ్రామం ..వరంగల్ లో క్యాన్సర్ అవగాహన కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. దివ్యాంగులకు ఒక లక్ష రూపాయలు అర్ధక సాయం చేస్తానని తెలిపారు.

కవిత రెడ్డి గారు TTA జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ మహిళా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నారు TTA ఈరోజు జ్యోతి రెడ్డి గారు మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనందంగా ఉంది అని తెలిపారు. దివ్యాంగులను చూసి చలించిన కవిత రెడ్డి భావోద్వేగానికి గురైయ్యారు.

TTA ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ గారు మాట్లాడుతూ జ్యోతి రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ చేపట్టడం సంతోషం గా ఉందని అన్నారు. వెనువెంటనే 50వేలు ఆర్థిక సహాయం దివ్యాంగులకు అందించారు.

TTA నాయకులు దుర్గ ప్రసాద్ గారు మాట్లాడుతూ TTA సేవా డేస్ లో పాల్గొనడం మా అదృష్టం అని అన్నారు.

TTA సేవా డేస్ కో ఆర్డినేటర్ సురేష్ గారు, మరియు నరసింహ TTA బోర్డ్ మెంబర్ మాట్లాడుతూ సేవా డేస్ కార్యక్రమాలను వివరించారు.

జ్యోతి రెడ్డి గారు TTA సేవా డేస్ హెల్త్ అండ్ వెల్ నెస్ అడ్వైసర్ మాట్లాడుతూ మెడికల్ క్యాంప్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మహిళలకు ప్రివెన్షన్ టెస్ట్ లు చేయడం జరిగిందని తెలిపారు. TTA చేసే కార్యక్రమాలలో ఇది ఒకటని అన్నారు.

TTA నేషనల్ కో ఆర్డినేటర్ ప్రదీప్ మెట్టు గారు మాట్లాడుతూ ఈరోజు TTA నిర్వహించిన జాబ్ మేళా మరియు హెల్త్ క్యాంప్ గురించి వివరించారు.

మనోహర్ గారు TTA ట్రేసరర్ మాట్లాడుతూ ప్రిసెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పారు.

TTA సభ్యులు వాని గారు మాట్లాడుతూ మహిళలకు క్యాన్సర్ అవగాహన అవసరం అని తెలిపారు..మొదటి స్థాయిలో క్యాన్సర్ ను కనుక్కోవడం వల్ల మహిళలను కాపాడటం చాలా ఈజీగా అవుతుందని తెలిపారు. అమ్మను కాపాడటంలో సమాజం పాత్ర కూడా ముఖ్యమని తెలిపారు. పేద మహిళలకు ఆరోగ్యం అవసరం అని TTA నుండి ఈకార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. 

కార్యక్రమంలో TTA సభ్యులు జ్యోతి రెడ్డి గారిని, మల్లికంబ అనాధ ఆశ్రమం రమలీల గారిని సన్మానించారు. TTA సభ్యులను ఆశ్రమ నిర్వాహకులు సన్మానించారు.

మానసిక వికలాంగుల తో కలిసి పాట లకు నృత్యాలుచేసిన NRI బృందం.. ఆహుతులను ఆకట్టుకుంది.

సేవా డేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు, INDIAN కోఆర్డినేటర్ గా డా. డి. ద్వారకనాథ రెడ్డి గారు, కో - కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం గారు, ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు, హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు, నర్సింహా పెరుక గారు - కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రసిడెంట్ గా వంశిరెడ్డి  కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, Kavitha Reddy - General Secretary గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు. మరియు TTA సభ్యులు సేవా డేస్ లో పాల్గొనడం జరిగింది.

Shiva Reddy Kolla - Joint Secretary
Manohar Bodke - Joint Treasurer 
Pradeep Mettu - National Coordinator
Ganesh Veeramaneni - Ethics Committee Director
Sangeetha Reddy - Board of Director
Venkat Gaddam - Board of Director

 

Click here for Photogallery

 

 

Tags :