ఆగమ సదస్సుకు వేదికగా పిట్స్ బర్గ్
సదస్సు వివరాలు :
ఈ ఆగమ సదస్సును నాలుగు సెషన్‌లుగా నిర్వహిస్తున్నారు. 29వ తేదీ ఉదయం 9.30 నుంచి 11 వరకు స్వాగత కార్యక్రమం ఉంటుంది. 11.30 నుంచి 12.30 వరకు సెషన్ 1 కింద టెంపుల్ కల్చర్ అండ్ ఆగమపై ప్రసంగం ఉంటుంది. సెషన్ 2 కింద 12.30 నుంచి 1.30 వరకు పాంచరాత్ర సాహిత్యంపై చర్చిస్తారు. 1.30 నుంచి 2.30 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. సెషన్ 3 కింద మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు పాంచరాత్ర ఆగమంలోని ఙానపద, యోగపదపై, సెషన్ 4 కింద 3.30 నుంచి 4.30 వరకు క్రియ, చార్యపదస్‌పై ప్రసంగం ఉంటుంది.
సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది.
30వ తేదీన జరిగే కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 9.30 నుంచి 11 వరకు నిత్యారాధన విధిపై ప్రసంగం ఉంటుంది. 11.నుంచి 11.15 వరకు టీ బ్రేక్, సెషన్ 2 కింద 11.15 నుంచి 12.30 వరకు వేద పారాయణం జరుగుతుంది. సెషన్ 3 కింద 12.30 నుంచి 1.30 వరకు ఉత్సవ ఏర్పాట్లు అనుసరించాల్సిన పద్ధతులపై చర్చిస్తారు. 1.30 నుంచి 2.30 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. సెషన్ 4 మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు జరుగుతుంది. వర్క్‌షాప్‌కు సంబంధించిన అభిప్రాయాలను తెలుసుకుంటారు.