ASBL Koncept Ambience

వెంకటేశ్వర దేవాలయాలకు టీటీడి అండగా ఉంటుంది - పోల భాస్కర్

వెంకటేశ్వర దేవాలయాలకు టీటీడి అండగా ఉంటుంది - పోల భాస్కర్

ప్రతిష్టాత్మకంగా ఫిట్స్ బర్గ్ వెంకటేశ్వర దేవాలయం లో  టీటీడి నిర్వహిస్తున్న 2 రోజుల ఆగమ శాస్త్ర సదస్సు ముగింపు సభలో మాట్లాడుతూ శ్రీ పోల భాస్కర్, జెఈవో ప్రపంచం లో ఏ చోట వున్నా వెంకటేశ్వర దేవాలయాలకు ఆలయ నిర్వాహణ లో, స్వామి వారి కైకర్యాల నిర్వహణ లో టీటీడి తగు సూచనలు ఇచ్చి అండగా ఉంటుందని అన్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచం లొనే అతి పెద్దదైన  హిందు ఆధ్యాత్మిక  సంస్థ అని, హిందు ధర్మ ప్రచారానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈ ఆగమ సదస్సు కూడా అందులో భాగం గానే ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి వెంకటేశ్వర దేవాలయానికి అధ్యాత్మిక పరంగా ఉన్న సందేహాలు, దేవాలయ నిర్వహణ పరంగా ఉన్న సందేహాలు తీర్చటానికి ఈ సదస్సు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.

అయితే కొన్ని దేవాలయాలుల వారు ఎందుకు టీటీడి ఈ సదస్సు నిర్వహిస్తోంది, మా పద్ధతుల మీద అజమాయిషీ చేస్తుందా  అని కొన్ని అపోహలతో ఉన్నారని, ఈ సదస్సు ద్వారా టీటీడి ఉద్దేశ్యం అందరికి అర్ధం అయ్యింది అని శ్రీ భాస్కర్ అన్నారు.  

అమెరికాలో 15 సంవత్సరాల యువకులకు వేద పఠనం మీద శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన వున్నదని, 6-7 పట్టణాలలో వచ్చే సంవత్సరం వేసవి సమయం లో ఈ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి ఆయా పట్టణాలలో ఉన్న వెంకటేశ్వర దేవాలయాలలో ముందుగానే చర్చించి కార్యాచరణ రూపం ఇస్తామని చెప్పారు. ఈ సదస్సు కు ఆతిధ్యం ఇచ్చి నిర్వాహణ లో సహకరించిన ఫిట్స్ బర్గ్ వెంకటేశ్వర దేవాలయ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫిట్స్ బర్గ్ దేవాలయ పుజారులను, సదస్సు లో పాల్గొన్న వివిధ దేవాలయాల ప్రతినిధులను తిరుపతి లడ్డు ప్రసాదం, మొమెంటో లతో సత్కరించారు.

Tags :