ASBL Koncept Ambience

ఘనంగా జరిగిన తానా-టీటీడి శ్రీనివాస కళ్యాణం

ఘనంగా జరిగిన తానా-టీటీడి శ్రీనివాస కళ్యాణం

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో జరుగుతున్న 22వ తానా మహాసభల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆధ్వర్యంలోతిరుమల శ్రీ వేంకటేశుని కళ్యాణం వైభవంగా జరిగింది. వేదపండితులు, తితిదే అర్చకులు శాస్త్రోక్తంగా ఈ కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు.. డీసీ కాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. తరువాత కళ్యాణోత్సవం చేశారు. ఈ కళ్యాణంలో తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, రవి మందలపు, డా.యడ్ల హేమప్రసాద్‌, సునీల్‌ పంత్ర, గాయనీ సునీత, గాయకుడు రామాచారి, దేవినేని లక్ష్మీ, గాయనీ స్మిత, చలపతి కొండ్రుకుంట, ప్రభల జగదీష్‌, సూరపనేని రాజా తదితరులు పాల్గొన్నారు.

Tags :