ఫిట్స్ బర్గ్ దేవాలయం లో వైభవం గా శ్రీనివాస కల్యాణం
ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఆగమ సదస్సు తరువాత సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు వైభవం గా శ్రీనివాస కల్యాణం జరిగింది.
టిటిడి నుంచి వచ్చిన శ్రీనివాసాచార్యులు, రాజేష్ కుమార్ ఆచార్యులు, పురుషోత్తమ ఆచార్యులు, ఫిట్స్ బర్గ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధమ శ్రీ వెంకటాచరి మరియు సహచర పూజారులు కలిసి ఈ వేడుక ను అత్యంత వైభవం గా ఈ కల్యాణం నిర్వహించటం విశేషం.
ఫిట్స్ బర్గ్ దేవాలయం లోని యాత్ర మూర్తులను పల్లకి లో ఊరేగింపు గా తీసుకు వచ్చి కల్యాణం నిర్వ హించారు. దేవాలయం లో ఉన్న మెయిన్ ఆడిటోరియం లో జరగటం, పబ్లిక్ కి ముందుగా చెప్పటం వలన భక్తులు కూడా పెద్ద సంఖ్య లో రావటం జరిగింది.
కల్యాణ కార్యక్రమంలో పండితులు ఒకరి తరువాత ఒకరు ప్రతి సంఘటన ను విశ్లేషించి చెప్పటం అందరిని ఆకర్షించింది. చివరగా తిరుపతి లడ్డు ప్రసాదం, ఫిట్స్ బర్గ్ దేవాలయం వారి లడ్డు ప్రసాదం విడివిడి గా భక్తులకు అందించారు. దేవాలయం వారు కల్యాణం లో పాల్గొన్న భక్తులందరికి రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేశారు.
అమెరికా తిరుపతి గా పేరొందిన ఫిట్స్ బర్గ్ వెంకటేశ్వర దేవాలయం లో టీటీడి వారితో కలిసి శ్రీనివాస కల్యాణం చేయడం చాలా అదృష్టం అని అందరు అనుకున్నారు.