ASBL Koncept Ambience

ఫిలడెల్ఫియాలో తానా-టీటీడి శ్రీనివాసకళ్యాణం జులై 13

ఫిలడెల్ఫియాలో తానా-టీటీడి శ్రీనివాసకళ్యాణం జులై 13

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్యం జరిగే ఉత్సవాల్లో ప్రముఖమైనది శ్రీనివాస కళ్యాణమే. ఆ కళ్యాణాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు అలాంటి కళ్యాణాన్ని ఫిలడెల్ఫియాలోని భక్తులు తిలకించేందుకు వీలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని 13వ తేదీన నిర్వహిస్తోంది. ఫిలడెల్ఫియాలోని భారతీయ టెంపుల్‌లో తిరుమల నుంచి వచ్చిన అర్చక, వేదపండితుల బృందంతో జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొనాలని, స్వామివారి ఆశీర్వచనాలను అందుకోవాలని తానా కోరుకుంటోంది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలనుకునేవారు ఈ నెంబర్‌లలో సంప్రదించవచ్చు. 908 930 6735, 267 252 2496, 267 825 5677, 973 610 4385, 267 317 6690కు ఫోన్‌ చేసి పేర్లను రిజిష్టర్‌ చేసుకోవచ్చు.

Tags :