ASBL Koncept Ambience

న్యూజీలాండ్ లో ఘనంగా ఉగాది వేడుకలు

న్యూజీలాండ్ లో ఘనంగా ఉగాది వేడుకలు

తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూజీలాండ్ ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర  ఉగాది వేడుకలు ఆక్లాండ్లోని మౌంట్ రాస్కిల్ వార్ మెమోరియల్ హాల్ లో హోనోరరీ ఇండియన్ హై కమిషన్ అఫ్ న్యూ జీలాండ్ భావ్ దిల్లోన్, భికూ బాణా ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముఖ్య అతిధులు గా నిర్వహింప బడ్డాయి. ఈ కార్యక్రమానికి న్యూజీలాండ్ లోని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఉగాది వేడుకల్లో భాగంగా ఉగాది ప్రాముఖ్యతను ఉమా రామారావు రాచకొండ వివరించగా, సందీప్ కుమార్ ప్యారాక ఆచార్య పఞ్చఙ్గ శ్రవణం, తెలంగాణ సంస్కృతి కి అద్దం పట్టే పలు సాంసృతిక, నృత్య ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. వండర్ గర్ల్స్, తెలంగాణ హార్ట్ బీట్స్ గ్రూప్స్, మరియు ఫాషన్ షో ప్రదర్శనలు కనులవిందుగా ఉండి ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. ఆరోగ్యమే మహాభాగ్యం లో భాగంగా “నెగ్గాలంటే తగ్గాలి ఛాలెంజ్ “ కు శ్రీకారం చుట్టడం జరిగింది.

కార్యక్రమానికి విచ్చేసిన అందరికి ఉగాది పచ్చడి తో పాటు, తెలంగాణ శాఖాహార విందును ప్రసన్న, గిరిధర్, శ్రీహరి ఏర్పాటు చేసారు.

ట్యాంజ్ అధ్యక్షుడు శ్రీ కళ్యాణ్ రావు కాసుగంటి ఉగాది కరదీపికలు ముద్రించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ఉగాది సంబురానికి విచ్చేసిన వీక్షకులకు పుస్తకాలను అందించడానికి సహకరించిన తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ హరికృష్ణ మామిడి గారికి, తెరాస న్యూజీలాండ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కోసిన గారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్ర శేఖర్ రావు గారు, తెలుగు ప్రపంచ మహాసభలు జరపడం, తెలుగు ను తప్పనిసరి సబ్జెక్టు గా చెయ్యడం గొప్ప పరిణామం.

అలాగే తెలుగును న్యూజీలాండ్ లో ప్రోత్సహించేందుకు వీలుగా ఇండియన్ అసోసియేషన్ టాగోర్ లైబ్రరీ లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, భాష, యాస సూచికలైన పలు పుస్తకాలను వుంచబోతున్నట్టు గా మరియు న్యూ జీలాండ్ ప్రభుత్వానికి తెలుగు ను రెండవ భాష ఆప్షన్ గా పాఠశాల లో భోధించడానికి వినతి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమం ట్యాంజ్ కోర్ అడ్వైసర్ శ్రీ నరేందర్ రెడ్డి పట్లోళ్ల పర్యవేక్షణలో, నిర్వహింప బడ్డాయి. ఈ కార్యక్రమానికి ట్యాంజ్ కార్యవర్గ సభ్యులు, జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి ఎడవల్లి నర్సింగ రావు పట్లొరి, విజేత రావు, రామ రావు రాచకొండ, జగన్ రెడ్డి వాడ్నలా, రామ్మోహన్ దంతాల, రామ్ రెడ్డి తాటిపత్రి, వినోద్ రావు ఎర్రబెల్లి, సురేందర్ రావు తదితరులు సహకరించారు.

Tags :