సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ముచ్చింతల్‌లోని సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా దర్శించుకున్నారు. అనంతరం రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొన్నారు. తిరునామం, పంచెకట్టుతో వచ్చి అమిత్ షా ముచ్చింతల్‌లోని దివ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. కేంద్రం విశిష్టతను చినజీయర్ స్వామి హోమంత్రికి వివరించారు. అనంతరం శ్రీరామానుజుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని, సమతామూర్తి విగ్రహం ఏకతా సందేశాన్ని అందిస్తోందన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత దాదాపు రెండున్నర గంటల పాటు సహస్రాబ్ది వేడుకల్లో అమిత్ షా పాలుపంచుకున్నారు.
Tags :