ముచ్చింతల్ లో 108 దివ్యదేశాలను దర్శించుకున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీరామనుజాచార్య సహస్త్రాబ్ది సమారోహ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవమూర్తులతో ప్రధాన యాగశాల నుంచి సమతామూర్తి కేంద్రం వరకు రుత్విజులు శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్ర తర్వాత దివ్యక్షేత్రాల్లోని 20 ఆలయాల్లో విగ్రహాలకు చినజీయర్‌స్వామి, వేదపండితులు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పటికే శ్రీరామనగరంలోని 32 ఆలయాల్లో ప్రాణప్రతిష్ట పూర్తయింది. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శ్రీరామనగరం విశేషాలను తెలుసుకున్నారు. 108 దివ్య దేశాలను దర్శించుకున్నారు. సమతామూర్తి కేంద్రంలో మొక్కలు నాటిన రాజ్‌నాథ్ సింగ్ లక్ష్మీ నారాయణ క్రతువులో పాల్గొన్నారు.
Tags :