70 లక్షలు కాదు... కోటీ మందితో!
భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కోసం జరుగుతున్న స్వాగత సంరంభం గురించి చాలా ఊహించుకొని మురిసిపోతున్నారు. అహ్మదాబాద్‍లో 70 లక్షల మంది తనకు స్వాగతం పలుకుతారని మొన్న ఉత్సాహంగా చెప్పిన ఆయన.. ఆ సంఖ్యను ఇప్పుడు కోటికి పెంచేశారు. పైగా అంతమంది వస్తారని ప్రధాని మోదీయే తనతో చెప్పారని కొలరాడోలో జరిగిన ప్రచార సభలో తెలిపారు. అంతేకాదు, అహ్మదాబాద్‍లో జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమం తనను చెడగొడుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే కోటి మంది హాజరయ్యే కార్యక్రమం చూశాక, అమెరికాలో 60 వేల మంది హాజరయ్యే సభలు తనను సంతృప్తి పర్చలేవని అన్నారు.
Tags :