వారధి సంక్రాంతి వేడుకలకు 400 మంది హాజరు
మేరీలాండ్ ఎల్లికాట్ సిటీలో వారధి తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కివానిస్ వల్లాస్ హాల్‌లో 400 మంది సమక్షంలో ఈ వేడుకులు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమంలోని ప్రతి చిన్న ఘట్టాన్ని వారధి సభ్యులు అత్యంత శ్రద్ధతో నిర్వహించారు. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను ముందు తరాలకు అందచేసే విధంగా ప్రతి కార్యక్రమాన్ని వారు తీర్చిదిద్దారు. మంత్రోచ్ఛారణతో కూడిన జ్యోతి ప్రజ్వలన, అనంతరం మన సంక్రాంతి సంప్రదాయాలతో ముగ్గుల పోటీను నిర్వహించగా మహిళులు అంత్యంత ఉత్సాహంతో పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారధి ప్రెసిడెంట్ పుష్యమి దువ్వూరి, శ్రీధర్ కమ్మదనం, వెంకట్ గాలి, అశోక్ అన్మల్శెట్టి, మారుతి కంభంపతి, సురేష్ బొల్లి, జెరల్ సెక్రటరీ సుమా ద్రోణం, చైర్మన్ కిరణ్ కదాలి తదితరులు పాల్గొన్నారు.
Tags :