ASBL Koncept Ambience

బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు తానా ఆహ్వానం

బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు తానా ఆహ్వానం

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జులై  7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తానా మహాసభలకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావుకు ఆహ్వానం అందింది. ఈ సభల్లో జరిగే ప్రధాన కార్యక్రమాల్లో డాక్టర్‌ వకుళాభరణం ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. హ్యూస్టన్‌, డల్లాస్‌, న్యూయార్క్‌, న్యూజెర్సీ, చార్లేట్‌ తదితర ప్రాంతాల్లో జరిగే ప్రత్యేక  ఆత్మీయ సమ్మేళనాలు, అభినందన సభల్లో కూడా డాక్టర్‌  కృష్ణమోహన్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. జులై 2 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించేందుకు చైర్మన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు తానా భారీ ఏర్పాట్లు చేసింది.

 

 

Tags :