ASBL Koncept Ambience

ఆటాకు వస్తున్న వెంకయ్య నాయుడు

ఆటాకు వస్తున్న వెంకయ్య నాయుడు

అమెరికా తెలుగు సంఘం జూలై 1 నుంచి చికాగోలో నిర్వహించే మహాసభలకు కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు హాజరవుతున్నారు. ఆయన అమెరికా పర్యటన ఖరారైంది. జూన్‌ 30న ఢిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెనడీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి డెల్టా విమానంలో చికాగో ఓ హేర్‌కు చేరుకుంటారు. 1వ తేదీన అమెరికా తెలుగుసంఘం కాన్ఫరెన్స్‌ విందు సమావేశానికి హాజరై, 2న ప్రారంభోపన్యాసం చేస్తారు. అదేరోజు వాషింగ్టన్‌ డీసికి వెళుతారని, 3న న్యూయార్క్‌ నుంచి తిరిగి న్యూఢిల్లీ వెళ్తారని తెలిసింది.

 

Tags :