ASBL Koncept Ambience

'తానా' సేవలో...మీ ఆశీస్సులతో- వెంక‌ట్ కోగంటి

'తానా' సేవలో...మీ ఆశీస్సులతో- వెంక‌ట్ కోగంటి

'తానా'తో నాకు 13 సంవత్సరాల అనుబంధం ఉంది. 'తానా' కార్యక్రమాలను విజయవంతం చేయడంతోపాటు కమ్యూనిటీకి ఏదైనా చేయాలన్న తపన ఉన్న నేను ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 'తానా' 'జాయింట్‌ సెక్రటరీ' పదవికి పోటీ చేస్తున్నాను.

నా జీవితంలో 'తానా` ఎన్నో మధురానుభూతులను ఇచ్చింది. కమ్యూనిటీ కోసం కొత్తగా ఆలోచించే ధైర్యం, అలా అనుకున్న ప్రణాళికలను ఆచరణలో పెట్టే అవకాశం, ఆ మార్గంలో నాకు మద్దతును అందించే ఎంతో మంది మంచి మిత్రులను కూడా 'తానా 'ఇచ్చింది. ఏ బంధమైనా నా అనుకునే బదులు మన అనుకుంటే అది ఒక దృఢమైన అనుబంధంలా మారుతుంది. దీనికి కమ్యూనిటీ కోసం ఏదైనా చేయాలనే తపన-ఉత్సాహం తోడైతే మరింతగా అద్భుత కార్యక్రమాలను చేయవచ్చున‌నేది 'తానా'లో సాధ్య‌మైంది.

ఒక సహాయ దర్శకుడు ఎలాగైతే సినిమా కార్యాచరణను తన భుజాలపైన మోస్తాడో అలా నేను 'జాయింట్‌ సెక్రటరీ'గా 'తానా'‌ కోసం పనిచేయాలనుకుంటున్నాను. మన తర్వాతి తరానికి మన సంస్క తి సంప్రదాయాలను అందించి మన పిల్లలు తమ మూలాల్ని మరిచిపోకుండా ఉండడానికి కావాల్సిన కార్యాచరణను రూపొందించుకుని అమలు చేయాలనుకుంటున్నాను. అదే సమయంలో 'తానా' ద్వారా కమ్యూనిటీకి కష్టకాలంలో అండగా నిలవాలనుకుంటున్నాను. 'తానా' ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాను.

'తానా' సేవ‌ల ప‌రంప‌రలో :

గుంటూరు జిల్లా య‌డ్ల‌పాడు గ్రామానికి చెందిన దివ్యాంగుల‌కు త్రిచ‌క్ర సైకిళ్ల‌ను అందించే ఆద‌ర‌ణ‌ కార్య‌క్ర‌మానికి డొనేష‌న్ అందించారు.

తెలంగాణ‌లోని ఖ‌మ్మంజిల్లాలోని ఖ‌మ్మంలో 10 మంది ఉత్త‌మ ప్ర‌తిభ చూపిన విద్యార్థుల‌కు 'తానా'చేయూత కార్య‌క్ర‌మం క్రింద స్కాల‌ర్ షిప్పులు అందించారు.

కృష్ణాజిల్లా కంచిక‌చ‌ర్ల‌లో 10 మంది ఉత్త‌మ ప్ర‌తిభ చూపిన విద్యార్థుల‌కు 'తానా'చేయూత కార్య‌క్ర‌మం క్రింద స్కాల‌ర్ షిప్పులు అందించారు.

క‌రోనా స‌మ‌యంలో అమెరికాలోని బే ఏరియాలో 'తానా' చేప‌ట్టిన అన్నార్తుల‌కు ఆహార సేవ‌ లో పాల్గొని ఆహారాన్ని అందించ‌డ‌మే కాకుండా 10 వేల అమెరిక‌న్ డాల‌ర్ల‌ను అందించారు. అదేవిధంగా 'తానా' వెస్ట్ టీంతో క‌లిసి స్వ‌యంగా సెల‌వు రోజుల్లో ఆయా కార్య‌క్ర‌మాలు విస్తృతంగా నిర్వ‌హించారు.

కృష్నాజిల్లా నూజివీడుకు చెందిన వీణ‌ల త‌యారీదారుడు మాబు షేక్ స‌హాయార్థం రూ.ల‌క్ష నిధుల‌ను సేక‌రించ‌డంలో యాక్టివ్‌గా పాల్గొన్నారు.

ఏపీలోని విజయ‌వాడ న‌గ‌రంలో క‌రోనా స‌మ‌యంలో రోజుకు వెయ్యిమందికి చొప్పున మొత్తం 10 వేల మందికి ఆహారాన్నిఅందించే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.

క‌రోనా స‌మయంలో కృష్ణా జిల్లా కంచిక‌చ‌ర్ల‌లో రైతులు, గ్యాస్ కార్మికులు, ఆటో డ్రైవ‌ర్ల‌కు మాస్కులు పంపిణీ చేశారు.

'తానా' చేప‌ట్టిన బ్యాక్ ప్యాక్ కార్య‌క్ర‌మంలో భాగంగా 2011 నుంచి పాల్గొంటూ.. స్థానిక బే ఏరియాలో బ్యాక్ ప్యాక్‌ల‌ను పంపిణీ చేస్తున్నారు.

2014, అక్టోబ‌రులో బే ఏరియాలో స్థానికుల కోసం చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి 30,132 డాల‌ర్ల‌ను సేక‌రించి 'తానా' నాయ‌క‌త్వానికి అందించారు.

త‌న స్వ‌దేశం భార‌త్‌లో డిజిట‌ల్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌కు 'తానా'/ ఏపీ జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మాల‌కు 2016లో విరాళాలు అందించారు. అదేస‌మ‌యంలో అవ‌స‌ర‌మైన కార్య‌క్ర‌మాలు, వ‌స‌తుల క‌ల్ప‌న‌కు 'వెంక‌ట్ కోగంటి' కృషి చేస్తున్నారు.

తానా' ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన 5 కిలో మీట‌ర్ల వాక్, ర‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామి అయ్యారు. 'తానా' వ‌న భోజ‌నాలు, క్రీడ‌లు, సీఏలో నిర్వ‌హించిన బోన్ మ్యారో కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన్నారు.

ప్ర‌తి రెండేళ్ల‌కు ఒక‌సారి భార‌త్‌లో 'తానా ' నిర్వ‌హించే చైత‌న్య స్ర‌వంతి కార్య‌క్ర‌మాల‌కు త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తున్నారు. 2016, డిసెంబ‌రులో నిర్వ‌హించిన వివిధ కార్య‌క్ర‌మాల్లోనూ 'వెంక‌ట్ కోగంటి పాల్గొన్నారు.

2019లో తిత్లీ స‌హా అనే తుఫాన్లు, ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు భార‌త్‌కు 'తానా 'ద్వారా విరాళాలు అందించారు.

2011(సీఏ), 2013(డ‌ల్లాస్‌), 2015(డెట్రాయిట్‌), 2017(సెయింట్ లూయిస్‌), 2019(డీసీ)ల్లో నిర్వ‌హించిన 'తానా' స‌ద‌స్సుల్లో విరాళాలు.

బాటా, ఏఐఏ, శంక‌ర్ ఐ ఫౌండేష‌న్‌, శాన్ రామ‌న్ క్రికెట్ అసోసియేష‌న్‌(ఎస్ ఆర్ సీ ఏ), ఆశా జ్యోతి వంటి స్థానిక ఆర్గ‌నైజేష‌న్ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం.

స్థానిక యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు , ముఖ్యంగా తెలుగు యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు 'తానా' చేప‌ట్టిన లైవ్ మ్యూజిక్ కార్య‌క్ర‌మాన్ని ప్రోత్స‌హించారు.

'తానా' బిజినెస్ క‌మిటీ చైర్మ‌న్‌గా స్థానిక బిజినెస్ కంపెనీల ప్ర‌తినిధుల‌తో 2017, 2018ల‌లో అనేక మార్లు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ క్ర‌మంలో వారి నుంచి సేక‌రించిన‌ స్టార్ట‌ప్ ఐడియాల‌ను 'తానా' నాయ‌క‌త్వంతో పంచుకున్నారు.

2014, 2016, 2018, 2020ల‌లో నిర్వ‌హించిన 'తానా 'స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాల్లో కొత్త మెంబ‌ర్ల‌ను చేర్చుకునేందుకు కృషి చేశారు.

'తానా' ఏ కార్యక్రమం చేసినా వాటిని విజయవంతం చేసే కార్యకర్తగా ఎంతోమంది మిత్రులు, సన్నిహితులు, 'తానా' సభ్యుల సహకారంతో కార్యక్రమాలను చేయగలిగాను. భవిష్యత్తులో కూడా మ‌రింత సేవ చేసేందుకు ఉత్సాహంతో ఉన్నాను. ఈ నేప‌థ్యంలోనే 'తానా' 'జాయింట్‌ సెక్రటరీ'గా గెలిపించాలని కోరుకుంటున్నాను. నన్ను మరియు మా టీం లొని అందరిని ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నాను.

వెంక‌ట్ కోగంటి
'తానా' 'జాయింట్‌ సెక్రటరీ

Tags :