ASBL Koncept Ambience

తానా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం... ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తానా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం... ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కి పైగా తెలుగు సంఘాలు భాగస్వాములుగా వర్చువల్‍ పద్దతిలో నిర్వహిస్తున్న ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం’కు ముఖ్య అతిధిగా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు హాజరవుతున్నారు. జూలై 24వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆయనతోపాటు ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

తానా అధ్యక్షులు జయ్‍ తాళ్ళూరి ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవంలో ప్రపంచంలోని పలు తెలుగు సంఘాలు కూడా పాలుపంచుకుంటున్నాయి. ఈ మహోత్సవంలో ప్రదర్శించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 12000 మందికి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకొని పోటీలకు సిద్దమవుతున్నారు. 3 సం. నుంచి 60 సం. వయస్సువారు ఎవరయినా ఈ పోటీలలో పాల్గొని తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పించారు. మహోత్సవాన్ని 8 భాగాలలో 33 విభాగాలలో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్‍ తూనుగుంట్ల శిరీష చెప్పారు. మూడు వందలకు పైగా జూం కాల్స్, 500 మందికి పైగా నిష్ణాతులైన న్యాయనిర్ణేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని శిరీష వివరించారు.

Tags :