ASBL Koncept Ambience

అమెరికాలో విజయవాడ అర్చకుల బృందం

అమెరికాలో విజయవాడ అర్చకుల బృందం

అమెరికాలో వివిధ నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కుంకుమ పూజల కోసం విజయవాడ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వచ్చిన అర్చకుల బృందానికి స్థానిక దేవాలయ ప్రతినిధులు, ఈ పూజలకు కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు, ఇతరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమెరికాలోని ఎన్నారైలు సుఖసంతోషాలతో ఉండాలన్న ఆశయంతోనే ఈ పూజలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయని వారు తెలిపారు. 

 

Tags :