ASBL Koncept Ambience

తానా మహాసభలో ప్రముఖుల ప్రసంగాలు...

తానా మహాసభలో ప్రముఖుల ప్రసంగాలు...

సెయింట్‌లూయిస్‌లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల్లో 2వ రోజు జరిగిన కార్యక్రమంలో ఎంతోమంది ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఐకమత్యంతో మెలగాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్నారైలు ముందుకురావాలని పిలిపునిచ్చారు. సినీనటుడు, ఎంపి మాగుంట మురళీ మోహన్‌ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు. గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధిపరిచేందుకు సహాయపడాలని ఆయన కోరారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ, అమెరికాలో తెలుగు భాష, సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించడం హర్షణీయమని చెప్పారు. సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ, తెలుగు భాషాభివృద్ధికి ఎన్నారైలు చేస్తున్న కృషి మరువలేనిదని పేర్కొన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర దర్శకుడు క్రిష్‌ను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జంపాల చౌదరి, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, తానా మాజీ అధ్యక్షుడు, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :