వాట్స్ ఉగాది వేడుకల్లో టాలీవుడ్ సందడి
దుర్ముఖి నామ సంవత్సర వేడుకలను అన్నీ చోట్లా ఘనంగా జరుపుకుంటున్నారు. వాషింగ్టన్‌లోని వాష్టింగ్టన్ తెలుగు సమితి (వాట్స్) ఆధ్వర్యంలో దుర్ముఖి నామ ఉగాది సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సరం అందరీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ పంచాంగ శ్రవణం చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్, ఉత్తేజ్, హాస్య నటుడు హరీష్, సినీ గాయని నూతన మోహన్, పాడుతా తీయగా ఫేం సందీప్ కూరపాటి ప్రత్యేక అకర్షణగా నిలిచారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు, పెద్దలు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. గాయకులు నూతన, సందీప్ ఆలపించిన గీతాలు ప్రేక్షకులను మైమరపింపజేశాయి. వాట్స్ కార్యవర్గ సభ్యులు భాస్కర్, రాంకొట్టి, అనుగోపాలం, షకీర్, శ్రీధర్, అనిల్, దేవేందర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు.