ASBL Koncept Ambience

వి విల్ స్టే ఎట్ హోమ్.. వి స్టే సేఫ్ అంటున్న కీరవాణి

వి విల్ స్టే ఎట్ హోమ్.. వి స్టే సేఫ్ అంటున్న కీరవాణి

కరోనా మహమ్మారిపై యుద్ధంలో భాగంగా టాలీవుడ్‍ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి ‘వి విల్‍ స్టే ఎట్‍ హోమ్‍.. వి స్టే సేఫ్‍’ అనే పాటను స్వయంగా రాసి, ట్యూన్‍ చేసి ఆలపించారు. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక అని బెదరకండి.. విందులు వినోదాలు కాస్త మానుకోండి.. బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి’, ‘ఇళ్లు ఒళ్లు మనసు శుభ్ర పరుచుకుంటే ఇలలోనే ఆస్వర్గాన్నే చూడొచ్చండి..ఇష్ట దేవతల్ని కాస్త తలచుకుంటే, ఏ కష్టమైనా అవలీలగా దాటొచ్చండి’ అనే లిరిక్స్ ప్రజల్లో చైతన్యంతో పాటు మనోధైర్యాన్ని తీసుకొస్తున్నాయి. కాగా, ఈ పాట కోసం ఆయన గతంలో ‘స్టూడెంట్‍ నెం. 1’ సినిమాకి కంపోజ్‍ చేసిన  ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’  పాట ట్యూన్‍నే మళ్లీ తీసుకున్నారు.

Tags :