హైదరాబాద్ నగరంతో కలిసి పని చేస్తాం - మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్
హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ సిటీ ముందుకు వచ్చింది. బోస్టన్‌లో ఆరోగ్య రంగంపై జరిగిన గ్లోబర్ ఇన్నోవేషన్-2022 సదస్సులో పాల్గొన్న మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్.. మంత్రి కేటీఆర్‌కు ఈ మేరకు హామీఇచ్చారు. హైదరాబాద్‌కు, బోస్టన్ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ తరహాలోనే బోస్టన్‌లో కూడా ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలకు చెందిన అనేక కంపెనీలు పని చేస్తున్నాయన్నారు. రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవకాశాలను పరిశీలించడంతో పాటు లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని చార్లీ బేకర్ పేర్కొన్నారు. తద్వారా ఈ రంగంలో అనేక నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు.
Tags :