హైదరాబాద్లో అంతార్జాతీయ సంస్థ వెబ్ పీటీ.. 150 కోట్ల రూపాయలతో గ్లోబల్ కేపబిలిటీస్ కేంద్రం
మరో అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ లో వ్యాపార కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఔట్ పేషెంట్ రీహాబిలిటేషన్ థెరపీకి అవసరయ్యే సాఫ్ట్ వేర్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా పేరున్న వెబ్ పీటీ సంస్థ హైదరాబాద్ లో తన గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ (GCC) ని ఏర్పాటు చేస్తుంది. కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే రోగులకు మరింత మెరుగైన పద్దతుల్లో రీహాబిలిటేషన్ థెరపీని అందించడానికి వైద్య సంస్థలకు అవసరమయ్యే ఎండ్ టు ఎండ్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ ను వెబ్ పీటీ సాఫ్ట్ వేర్ అందిస్తుంది. 2008 లో అమెరికాలోని ఫీనిక్స్ కేంద్రంగా ప్రారంభమైన వెబ్ పీటీ సాఫ్ట్ వేర్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది.
వెబ్ పీటీ సీఈఓ ఆష్లే గ్లోవర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ షుగా, సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, సీఈఓ సందీప్ శర్మ లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సమావేశయ్యారు. తమ విస్తరణ ప్రణాళికలను వివరించారు.
150 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీస్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న వెబ్ పీటీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వెబ్ పీటీ విజయాల్లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు.