సాన్ రామోన్" నగరంలో ఘనంగా WETA "బతుకమ్మ" సంబరాలు!!
కాలిఫోర్నియాలోని బే ఏరియాలో లోని "సాన్ రామోన్" నగరంలో "బతుకమ్మ" సంబరాలు ఘనంగా నిర్వహిచారు! WETA ఈ ఏడాది మరింత ఉత్సాహంతో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. పూలను అమ్మవారిగా భావించి పూజించే గొప్ప సంప్రదాయం మనకిక్కడ కనిపిస్తుంది. ఈ పండుగ రోజుల్లో దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి మహిళలందరూ బృందవలయాలుగా ఏర్పడి పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలివచ్చిందన్న చందంగా వేడుక సాగింది.
మా టీవీ "రేలా-రే-రేలా" 5 దరువు టైటిల్ విన్నర్ "శాలిని" మూడు గంటల పాటు బతుకమ్మ పాటలతో హుషారు నింపి హోరెత్తించారు.
ఏటా 1000 మందితో "బతుకమ్మ" పండుగను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షించిన "WETA" ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్ చేసినందుకు ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారు ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు.
ఈ సందర్బంగా ఫౌండర్ ప్రెసిడెంట్, Advisory చైర్ ఝాన్సీ రెడ్డి గారు కో-చైర్ Dr అభితేజ కొండా గారు మా టీవీ "రేలా-రే-రేలా" 5 దరువు టైటిల్ విన్నర్ "శాలిని" కి ధన్యవాదాలు తెలియ చేసి, ఈ వేడుకను విజయవంతం చేసినందుకు తెలుగు వారందరికీ ధన్యవాదాలు తెలియ చేసారు.
ఈ కార్యక్రమములో "WETA " టీమ్ ఫౌండర్ ప్రెసిడెంట్, Advisory చైర్ ఝాన్సీ రెడ్డి గారు కో-చైర్ Dr అభితేజ కొండా, ప్రెసిడెంట్ శైలజ కల్లూరి, పూజ లక్కడి, ట్రేజరర్, సుగుణ రెడ్డి, BOD మీడియా చైర్, విశ్వా వేమిరెడ్డి BOD అనురాధ అలిశెట్టి -BOD మెంబెర్స్ /స్పాన్సర్ చైర్, హైమ అనుమాండ్ల , BOD, హాస్పిటాలిటీ చైర్ , రత్నమాల వంక -BOD,కమ్యూనిటీ ఔట్రీచ్ , రేఖ రెడ్డి -శాక్రమెంటో రీజినల్ వైస్ -ప్రెసిడెంట్, చందన రెడ్డి - బే ఏరియా రీజినల్ వైస్ -ప్రెసిడెంట్, గ్రేస్ గొల్లపల్లి -సెంట్రల్ వాలీ -రేగిపోనా వైస్ -ప్రెసిడెంట్, సునీత గంప -సోషల్ మీడియా చైర్, శ్రీ సుధా శరణు -హాస్పిటాలిటీ చైర్ కూడా పాల్గొన్నారు.